వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fake : జీఎస్టీ రీఫండ్ పేరుతో మెసేజ్‌లు.. ఆ లింకుపై క్లిక్ చేయవద్దు..

|
Google Oneindia TeluguNews

కరోనా వ్యాప్తిని నియంత్రించడం కంటే ఫేక్ న్యూస్‌ను నియంత్రించడం పెద్ద సవాల్‌గా మారింది. తాజాగా జీఎస్టీ రీఫండ్‌కి సంబంధించిన ఓ ఫేక్ మెసేజ్ పుట్టుకొచ్చింది. కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో జీఎస్టీ రీఫండ్‌కి సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టిందనేది దాని సారాంశం. అంతేకాదు,అదే మెసేజ్‌లో ఓ లింకును కూడా పొందుపరిచారు. దానిపై క్లిక్ చేసి రీఫండ్‌ను పొందాలని సూచిస్తున్నారు.

అయితే ఇదంతా ఫేక్ అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ & కస్టమ్స్(CBIC) స్పష్టం చేసింది.ట్యాక్స్ చెల్లింపుదారులు ఇలాంటి మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని.. తొందరపడి ఆ లింకులను క్లిక్ చేయవద్దని సూచించింది. ఇవి తప్పుదోవ పట్టించే మెసేజ్‌లు అని,సీబీఐసీతో వీటికి ఏమాత్రం సంబంధం లేదని తెలిపింది. జీఎస్టీ ఫైలింగ్స్ కోసం get.gov ను సంప్రదించాలని చెప్పింది.

Do not click on this link for online processing of GST refund

కాగా, క‌రోనా వైర‌స్ లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప‌న్ను చెల్లింపుదారుల‌కు ఊర‌ట క‌లిగించేందుకు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ రూ.5లక్షల వరకు రీఫండ్‌ను జారీ చేస్తోంది. దీంతో సుమారు 14 లక్షల మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉందంటున్నారు. అలాగే అన్ని జీఎస్టీ, కస్టమ్ రీఫండ్స్‌ను వెంటనే రిలీజ్ చేయనున్నట్టు గతంలో ఐటీ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే.

English summary
There is a message that claims that the government has started online processing GST refund.The message reads, " due to COVID-19 outbreak, Central government has started online processing of GST refund." The message also provides a link, which it says one should click in order to get the refund.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X