హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బక్రీద్‌ రోజున ఆవులను బలి ఇవ్వద్దు: హైదరాబాద్ ముస్లిం మతపెద్దలు నిర్ణయం

|
Google Oneindia TeluguNews

ఈ నెల 12న జరగనున్న బక్రీద్ పండుగ జరుపుకోనున్న నేపథ్యంలో ఎలాంటీ అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టారు హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ అంజనీకుమార్. ఎలాంటీ అవంచనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వ డిపార్ట్‌మెంట్లతో పాటు, ముస్లిం మతపెద్దలతో పోలీసులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వివాదాలకు దూరంగా పండగ జరుపుకుకోవాలని సూచించారు.

గోవులను బలి ఇవ్వద్దు ముస్లిం పెద్దల సూచన

గోవులను బలి ఇవ్వద్దు ముస్లిం పెద్దల సూచన

ఈ నేపథ్యంలోనే సమావేశంలో పాల్గోన్న ముస్లిం పెద్దలు పలు సూచనలు చేశారు. పండగ సంధర్భంగా ఆవులను బలి చేయద్దని ముస్లిం నాయకులు, మత పెద్దలకు సూచించారు. పండుగ ఆచారం ప్రకారం నాలుగు కాళ్ల జంతువును బలిదానం ఇవ్వాలని అయితే ఇతర మతాల వారి సెంటిమెంట్లను కూడ గౌరవించాలని వారు సూచించారు. ఈ నేపథ్యంలోనే పలు సూచనలు చేసి సామరస్యంగా ఎలాంటీ సంఘటనలు జరగకుండా పండగను జరుపుకుకోవాలని చెప్పారు.

ఇతర ప్రాంతాల నుండి వచ్చే గోవులతోనే సమస్య

ఇతర ప్రాంతాల నుండి వచ్చే గోవులతోనే సమస్య

కాగ ఇటివల గోరరక్షక కమీటీలు ఆవులను రక్షించేందుకు పెద్ద ఎత్తున పూనుకోవడంతో ఎలాంటీ వివాదాలకు తావు లేకుండా గోవులను బలి చేసే కార్యక్రమానికి పూనుకోవద్దని చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో గోరక్షక్ వారి నుండి ఎలాంటీ ఇబ్బందులు లేవని, కాని ఇతర జిల్లాల నుండి వచ్చే నగరానికి చేరుకునే వారిపైనే దాడులు కొనసాగుతున్నాయని తెలిపారు. కాగా ఇలాంటీ వాటిపై పోలీసులు ఎలాంటీ చర్యలు తీసుకున్న అభ్యంతరం లేదు కాని, ప్రైవేటు వ్యక్తులు అధికారాన్ని తీసుకుంటే మాత్రం ఇబ్బందిగా మారనుందని ముస్లిం నాయకులు అన్నారు.

అంత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

అంత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

మరోవైపు కేంద్రంలో బీజేపీ అతిపెద్ద మెజారీటీ రావడంతో ఇలాంటీ వాటిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈనేపథ్యంలో దీంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడ రాజధాని నుండి ప్రాతినిధ్యం వహించడంతో మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. ముఖ్యంగా రెండు వర్గాల మధ్య ఏ చిన్న సమస్య వచ్చినా అది దేశ వ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశాలున్నాయి. దీంతో గతంలో కంటే బక్రీద్ పండగను అంత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య నిర్వహించనున్నారు.

English summary
Hyderabad CP Anjanekumar held a review meeting today with the heads of various government departments on the arrangements in the wake of the Bakrid festival
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X