వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్ పేరుపై హోరెత్తిన రాజ్యసభ, ప్లకార్లులు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాజ్యసభలో కాంగ్రెస్ తెలంగాణ పార్లమెంటు సబ్యులు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం అంశంపై రగడ చేసారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయం జరుగుతుండగానే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. శంషాబాద్ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరునే కొనసాగించాలన్న అంశంపై చర్చించాలని ఆనంద్ శర్మ రాజ్యసభ చైర్మన్‌ హమీద్ అన్సారీని కోరారు.

ఆ అంశంపై ముందుగా నోటీసు ఇవ్వాలని చైర్మన్ సూచించారు. కానీ కాంగ్రెస్ ఎంపీలు అప్పటికప్పుడే చర్చ జరపాలని పట్టుపట్టారు. ఆ మొత్తం సమయం అంతా ఎంఏ ఖాన్, వీ హనుమంతరావు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలం ప్లకార్డులు ప్రదర్శించారు. నోటీసు లేకుండా చర్చకు అనుమతించడం సాధ్యం కాదంటూ చైర్మన్ సభను వాయిదా వేసారు.

12 గంటలకు సభ మళ్ళీ మొదలైన తర్వాత కాంగ్రెస్ ఎంపీలు అదే అంశంపై రగడ సృష్టించారు. నినాదాలతో హోరెత్తించారు. స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్ళి నినాదాలు చేశారు. దాంతో సభను మధ్యాహ్నం ఒంటిగంట వరకూ వాయిదా వేసారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ సభ్యురాలు విజయలక్ష్మి సాధో కూడా జత కూడారు.

ఎన్టీఆర్ పేరుపై

ఎన్టీఆర్ పేరుపై

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దేశీ టెర్మినల్‌కు ఎన్టీ రామారావు పేరు పెట్టడాన్ని నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెసు రాజ్యసభ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు.

ఎన్టీఆర్ పేరుపై..

ఎన్టీఆర్ పేరుపై..

శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశీ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై తక్షణమే చర్చకు అనుమతించాలని కాంగ్రెసు సభ్యులు రాజ్యసభలో డిమాండ్ చేశారు.

ఎన్టీఆర్ పేరుపై..

ఎన్టీఆర్ పేరుపై..

శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశీ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెసు సభ్యులు మంగళవారం రాజ్యసభలో ప్లకార్డులు ప్రదర్శించారు.

ఎన్టీఆర్ పేరుపై..

ఎన్టీఆర్ పేరుపై..

సభ్యులు నోటీసు ఇస్తేనే సభలో చర్చకు అనుమతించడానికి వీలుంటుందని రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ తేల్చి చెప్పారు.

English summary
Telangana Congress Senior RS MPs V.Hanumantha Rao with M.A. Khan and Madhya Pradesh RS MP Vijaylaxmi Sadho protested at Parliament house in New Delhi on Tuesday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X