వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సలీం వ్యాఖ్య, రాజ్‌నాథ్ భావోద్వేగం: ఇక్కడొద్దని స్పీకర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 800 ఏళ్ల తర్వాత హిందూ రాజ్యం వచ్చిందని హోంమంత్రి చెప్పారని సిపిఎం ఎంపీ సలీమ్ లోకసభలో సోమవారం వ్యాఖ్యానించడం రగడకు దారి తీసింది. 193 నిబంధన కింద సభలో అసహనంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సలీం మాట్లాడాడు.

హిందూరాజ్యం వచ్చిందని హోంమంత్రి చెప్పారన్నారు. ఆ వ్యాఖ్యలపై బిజెపి ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీనిపై హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ... తన పైన సలీం చేసిన ఆరోపణలు నిరూపించాలని లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సలీం తనపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆయన క్షమాపణలు చెప్పాల్సిందేనని, తాను ఎప్పుడూ ఇంతగా బాధపడలేదని భావోద్వేగానికి లోనయ్యారు. దానికి సలీం మాట్లాడుతూ... తాను ఎప్పుడూ ఆరెస్సెస్ సమావేశాల్లో కూర్చోలేదని, పత్రికల్లో వచ్చిన దానిని చెప్పానన్నారు.

ఔట్‌లుక్ పత్రికల్లో ప్రచురితమైన వ్యాఖ్యలనే ప్రస్తావించానని, తాను సభలో ప్రస్తావించింది తప్పని భావిస్తే ఉరి తీస్తారా.. తీయండి, ఏ శిక్ష వేస్తారో వేయండన్నారు. మరోవైపు ఆధారాలు లేకుండా ఆరోపణలు సరికాదని లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మందలించారు. ఎంపీలు సభలో అసహనం చూపించవద్దన్నారు.

Do not show intolerance in house, Parliament Speaker tells MPs

అంతకు ముందు సలీం మాట్లాడుతూ... అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉందన్నారు. మేథావులు, శాస్త్రవేత్తలు దేశంలోని పరిస్థితి పైన ఆందోళన చెందుతున్నారన్నారు. విమర్శించే ప్రతి వారు దేశద్రోహులు కాదన్నారు. అందరికీ భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందన్నారు. భారత రాజ్యాంగం అందరికీ మాట్లాడే హక్కు ఇచ్చిందని తెలిపారు.

మేధావులు ఒక్కొక్కరూ అవార్డులు వెనక్కి ఇస్తున్నారని చెప్పారు. అసహనం చాలా తీవ్రమైన అంశమన్నారు. భారత్ ఫాసిస్ట్ దేశం కాదు.. ప్రజాస్వామ్య దేశమన్నారు. ఎవరు ఏ ఆహారం తింటారో అది వారి వ్యక్తిగతమన్నారు. పృథ్వీరాజ్ చౌహాన్ తర్వాత హిందూరాజ్యం వచ్చిందని ఎన్నికల్లో గెలిచిన తర్వాత చెప్పారన్నారు.

కాగా, గందరగోళం మధ్య సభను స్పీకర్ వాయిదా వేశారు. సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. మధ్యాహ్నం సభ తిరిగి ప్రారంభమైంది.

బిజెపి రాజీవ్ ప్రతాప్ రూఢీ మాట్లాడుతూ... హోంమంత్రి పైన సలీం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. రాజ్‌నాథ్ ఆ వ్యాఖ్యలను ఖండించారని చెప్పారు. కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ మాట్లాడుతూ... తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని రాజ్ నాథ్ చెబితే సరిపోతుందన్నారు.

ఔట్ లుక్ కథనాన్ని ఆయన ప్రస్తావించారన్నారు. అనంతరం మీనాక్షి లేఖి మాట్లాడుతూ... సలీం, పాత్రికేయుల పైన సభా ఉల్లంఘన హక్కుల నోటీసు ఇవ్వాలన్నారు. సలీం చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు.

English summary
Never said India got a 'Hindu ruler' after 800 years, claims Rajnath Singh after CPM MP Mohd Salim's accusation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X