వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంపూర్ణ సూర్యగ్రహణం, ఎప్పటినుంచో తెలుసా, గ్రహణం రోజు ఏం చేయొద్దు, ఏం చేయాలి..

|
Google Oneindia TeluguNews

మరికొన్ని గంటల్లో సూర్యగ్రహణం రాబోతుంది. గురువారం వచ్చే సూర్యగ్రహణం ఏడాదిలో మూడో సూర్యగ్రహణం, అలాగే సంవత్సరంలో చివరి వార్షిక సూర్యగ్రహణం. దీనినే 'రింగ్ ఆఫ్ పైర్' అని కూడా అంటారు.

 గ్రహణం అంటే..?

గ్రహణం అంటే..?

సూర్యుడు, భూమి మధ్య మార్గాన్ని చంద్రుడు అడ్డుకున్న సమయంలో సూర్యగ్రహణం వస్తోంది. సూర్యుడిని కప్పి ఉండటం వల్ల గ్రహణం ఏర్పడుతుంది. ఆయా సందర్భాన్నీ బట్టి పాక్షికంగా లేదంటే సంపూర్ణంగా సూర్య, లేదా చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

ఉదయమే..

ఉదయమే..

స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 7.59 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమవుతోంది. ఉదయం 9.04 గంటలకు గ్రహణం సంపూర్ణ స్థితికి చేరుకుంటుంది. ఉదయం 10.47 గంటలకు గ్రహణం ముగుస్తోంది. సూర్యగ్రహణం గరిష్టంగా 3 నిమిషాల 40 సెకన్ల పాటు ఉండనుంది.

ఈ దేశాల్లో..

ఈ దేశాల్లో..

సూర్యగ్రహణం భారతదేశంతోపాటు ఆస్ట్రేలియా, ఫిలిఫ్పీన్స్, సౌదీ అరేబియా, సింగపూర్‌లలో కనిపిస్తోంది. సౌదీ అరేబియా, ఖతర్, యుఏఈ, ఒమన్, శ్రీలంక, మలేసియా, ఇండోనేషియా, సింగపూర్, ఉత్తర మరియనా ద్వీపం, గ్వామ్‌లో వార్షిక సూర్యగ్రహణం కనిపిస్తోంది. కోజికోడ్, కోయంబత్తూర్, జప్నా, ట్రింకోమలి, సిబొల్గా, బాటామ్, సింగపూర్, సింగ్కావాంగ్, గ్వామ్‌లలో సంపూర్ణ సూర్యగ్రహణం స్పష్టంగా కనిపించనుంది. ఈ ఏడాది కేరళలోని చెరువతూర్ నుంచి సూర్యగ్రహణం స్పష్టంగా కనిపించింది.

ఏం చేయకూడదంటే..

ఏం చేయకూడదంటే..

సూర్యగ్రహణం రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదనే అంశంపై భిన్న వాదనలు ఉన్నాయి. గ్రహణం సమయంలో ఆహారం తీసుకోవద్దని, నీరు కూడా తాగొద్దని పెద్దలు చెప్తుంటారు. గ్రహణానికి ముందునుంచే ఇంట్లో వంట చేయకూడదని అంటారు. ఇంట్లో ఉన్న వృద్ధులకు ఆహారానికి బదులు ఎలక్ట్రోలైట్లు ఇవ్వాలని సూచిస్తారు. సూర్యరశ్మి కనిపించని సమయంలో బ్యాక్టీరియా చురుగ్గా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవద్దని సూచిస్తున్నారు.

నేరుగా చూడొద్దు..

నేరుగా చూడొద్దు..

సూర్యగ్రహణం సమయంలో అతినీతలోహిత కిరణాలు చురుగ్గా ఉండటంతో ఆహారం తీసుకోవద్దని చెప్పే మాటలను చాలా మంది విశ్వసిస్తారు. అంతేకాదు గ్రహణం సమయంలో ఆకాశం వైపు నేరుగా చూడొద్దని సలహా ఇస్తున్నారు. నేరుగా కిరణాలను చూడటంతో వారి కంటి దృష్టిపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్తున్నారు. గ్రహణం సమయంలో ఆలయాలను కూడా మూసివేస్తారు. శుద్ధి చేశాకే మళ్లీ ఆలయాలను తెరుస్తారు.

గర్భవతులు కూడా

గర్భవతులు కూడా


గ్రహణం గురించి పురాణాల్లో అనేక విషయాలు చెప్పారు. తినొద్దని, మంచినీళ్లు కూడా తీసుకోవద్దని సూచిస్తారు. వెలుగునిచ్చే సూర్యుడు కనిపించని సమయంలో ఏం పని చేయకూడదని విశ్వసిస్తారు. కానీ నేడు గ్రహణ సమయాలపై అంతగా పట్టింపులు లేవు. కానీ గర్భవతుల విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రహణ సమయంలో వారు ఒకేవిధంగా పడుకొనేటట్టు చూస్తున్నారు.

English summary
26th of December, the world will witness "Annual Solar Eclipse" and it will be third & final solar eclipse of the year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X