వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇరోమ్ షర్మిలా కవల పిల్లలను చూడాలని ఉందా..?

|
Google Oneindia TeluguNews

మణిపూర్ లో సాయుధ బలగాల పత్రేక చట్టం కోసం ఏకంగా 16 సంవత్సరాల పాటు నిరాహరదీక్ష చేసిన ఉక్కుమహిళ ఇరోమ్ షర్మిలకు రెండు రోజుల క్రితం కవలలు జన్మించిన విషయం తెలిసిందే..అదికూడ మదర్స్‌డే ఉత్సవాలను ప్రపంచవ్వాప్తంగా జరుపుకునే సంధర్భంలో ఆమే ఇద్దరు పండంటి కవలలకు జన్మనిచ్చారు. ఆ పిల్లల ఫోటోలను షర్మీల దంపతులు విడుదల చేశారు.

యుక్తవయసంతా ప్రజల కోసం

యుక్తవయసంతా ప్రజల కోసం

యుక్తవయసంతా ప్రజల కోసం దారపోసింది..అది కూడ మాములు ఉద్యమం కాదు. తనను బంధించుకుని తాను తినకుండా సమాజంలోని అందరి వ్యక్తుల్లా ఆలోచించకుండా ప్రభుత్వాలు దిగివచ్చే విధంగా ఆమే ఉద్యమాన్ని చేపట్టింది. నిరహార దీక్షలంటే ఒకరోజు, రెండు రోజులు లేదంటే రిలే నిరహార దీక్షలు మహాఅయితే ఒకటి రెండు సంవత్సరాలు చేస్తారు. కాని ఆమే ఏకంగా 16 సంవత్సరాలు పాటు నిరహార దీక్ష చేసింది. అందుకే ఉక్కు మహిళ అయింది..

ఇరోమ్ ఇద్దరు ఆడపిల్లలు

ఇరోమ్ ఇద్దరు ఆడపిల్లలు

మరి ఆ ఉక్కు మహిళ సమాజ పరంగా తన కర్తవ్యాన్ని నిర్విహించిన అనంతరం వ్యక్తిగత జీవితంలోకి అడుగుపెట్టింది. 2017లో గోవాలో పుట్టి బ్రిటిష్ జాతీయత కల్గి కొడైకెనాల్‌లో స్థిరపడ్డ డెస్మండ్ కొటిన్హాను ఇరోమ్ షర్మీలా పెళ్లి చేసుకుంది. గత ఆదివారం దంపతులకు బెంగుళూరు లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇద్దరు పండంటి అడపిల్లలైన కవలలు కూడ జన్మించారు. కాగ వారు సాధరణ కూడ 2.15 కిలల సాధారణ బరువును కల్గి ఉన్నారని చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు.కాగా ఆ ఇద్దరు పిల్లలకు నిక్స్ సఖీ, ఆటం తార అనే పేర్లు కూడ పెట్టారు. అలాంటీ వారి పిల్లలను చూడాలనే కుతుహలం ప్రతి ఒక్కరిలో కూడ ఉంటుంది అందుకే ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి..

 28 సంవత్సరాల వయస్సులో దీక్ష

28 సంవత్సరాల వయస్సులో దీక్ష

కాగా ఇరోమ్ షర్మీల మణిపూర్ ప్రత్యేక హక్కుల కోసం ఆమే 28 సంవత్సరాల వయస్సులో నిరహారదీక్షను ప్రారంభించింది. కాగా ఆమే ఆరోగ్యం క్షీణించడంతో స్థానిక పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆమేకు లిక్విడ్స్ ద్వార చికిత్సను అందించారు. అయినా ఆమే దీక్షను మాత్రం వీడలేదు..ఇంటికి వచ్చిన అనంతరం కూడ ఆమే దీక్ష కొనసాగించారు. ఇలా 16 సంవత్సరాల అనంతం దీక్ష విరమించింది. అనంతరం రాజకీయ రంగప్రవేశం చేసింది. కాని రాజకీయాల్లో ఎక్కువ కాలం ఇమిడలేకపోయింది. తద్వార వ్యక్తిగత జీవీతంలోకి అడుగుపెట్టింది.

English summary
The entire world knows her as the Iron Lady. With her iron-alike determination, Irom Sharmila has proven hers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X