వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గూగుల్ తల్లి చెప్పని నిజం: తీహార్ జైలులో నోబెల్ పురస్కార గ్రహీత అభిజీత్ బెనర్జీ

|
Google Oneindia TeluguNews

Recommended Video

#NobelPrize2019 : Abhijit Banerjee Nobel Prize Winner In Tihar Jail || Oneindia Telugu

అభిజీత్ బెనర్జీ... ఆర్థికశాస్త్రంలో నోబెల్ పురస్కారం దక్కించుకున్న భారత సంతతి వ్యక్తి. దేశంను గర్వపడేలా చేసిన ఆర్థికవేత్త. ఇప్పటికే అభిజీత్ బెనర్జీ నేపథ్యంపై నెటిజెన్లు ఇంటర్నెట్‌లో తెగ వెతికేశారు. ఆయన గురించి తెలుసుకున్నారు. అంతలా అభిజీత్‌ను గూగుల్ చేసినప్పటికీ గూగుల్ తల్లి కూడా అభిజీత్ గురించి ఓ విషయం మరిచింది. ఇంతకీ ఆ విషయం ఏమిటో తెలుసా..?

నోబెల్ బహుమతి గెలుచుకున్న ఆరవ కపుల్ అభిజీత్ బెనర్జీ-ఎస్తేర్ డఫ్లోనోబెల్ బహుమతి గెలుచుకున్న ఆరవ కపుల్ అభిజీత్ బెనర్జీ-ఎస్తేర్ డఫ్లో

జైలు జీవితం గడిపిన అభిజీత్ బెనర్జీ

జైలు జీవితం గడిపిన అభిజీత్ బెనర్జీ

అభిజీత్ బెనర్జీ.. ప్రస్తుతం పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచంలో పేదరిక నిర్మూలనపై తన సహచరులతో కలిసి చేసిన పరిశోధనలను గుర్తిస్తూ ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించింది జ్యూరీ. కోల్‌కతాలో విద్యనభ్యసించిన అభిజీత్ ఆ తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో ఎంఏ చేశారు. ఇక్కడి వరకు నెటిజెన్లకు కావాల్సిన సమాచారం దొరికింది. కానీ తాను జేఎన్‌యూలో విద్యార్థిగా ఉన్న సమయంలో జైలు జీవితం గడిపారని అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు.

 తీహార్ జైలులో 10 రోజులు

తీహార్ జైలులో 10 రోజులు

అవును నేడు ప్రపంచం గర్వించదగ్గ ఆర్థికవేత్తగా ఎదిగిన అభిజీత్ బెనర్జీ... నాడు విద్యార్థిగా ఉన్న సమయంలో 10 రోజుల పాటు తీహార్ జైలులో ఉన్నారు. 2016లో దేశవ్యతిరేక చర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కొందరు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 1983లో స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్‌పై జేఎన్‌యూ వైస్ ఛాన్సెలర్‌ను వేటు వేయడంతో ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా ఘెరావ్ చేసిన ఘటనలో పోలీసులు అభిజీత్‌ను అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపారు. అక్కడే అభిజీత్ 10 రోజుల పాటు జైలు జీవితం గడిపారు.

 జైలులో నన్ను చితకబాది హత్యాయత్నం కేసు పెట్టారు

జైలులో నన్ను చితకబాది హత్యాయత్నం కేసు పెట్టారు

10 రోజుల పాటు తను తన స్నేహితులను తీహార్ జైలులో పోలీసులు కొట్టారని నాటి చేదు జ్ఞాపకాలను ఓ సందర్భంలో అభిజీత్ చెప్పారు. తనను చితకబాదిన పోలీసులు తనపై హత్యయత్నం కేసును నమోదు చేశారని అభిజీత్ చెప్పారు.ఆ తర్వాత కేసును పోలీసులు ఉపసంహరించుకున్నారని ఇందుకు భగవంతుడికి తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. ఆ కేసు ఉన్ని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు. ఆ రోజుల్లో పోలీసులకు మద్దతుగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలవగా.. యూనివర్శిటీలో కమ్యూనిస్టు భావజాలాలున్న ఫ్యాకల్టీ కూడా సపోర్ట్ చేసిందని గుర్తుచేసుకున్నారు.

క్యాంపస్‌పై పట్టు సాధించాలనే యోచనలో నాటి సర్కార్

క్యాంపస్‌పై పట్టు సాధించాలనే యోచనలో నాటి సర్కార్

ఆరోజుల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అడ్మిషన్ పొందేందుకు వెయిటేజ్ ఇవ్వాలని అప్పటి స్టూడెంట్ ప్రెసిడెంట్ ధర్నాకు దిగారు అనే ఆరోపణల పై ఆయనపై వేటు వేశారని చెప్పారు. కానీ ఆ ఆరోపణలు నిజం కాదని అభిజీత్ తెలిపారు. ఇదిలా ఉంటే యూనివర్శిటీ క్యాంపస్‌లో తమదే అధికారం ఉండాలని తమ మాటే చెల్లుబాటు అయ్యేలా ఉండాలని నాడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిందని అభిజీత్ చెప్పారు. యూనివర్శిటీ విద్యార్థులకు ఓ స్వర్గధామం అని దాన్ని ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవడం చాలా హేయమైన చర్యగా అభివర్ణించారు. తాము చెప్పిందే వేదమని అప్పట్లో విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేశారని అభిజీత్ వెల్లడించారు.

English summary
Abhijit Banerjee, the Indian-origin economist who won the Nobel prize on Monday, spent 10 days in Delhi's Tihar jail for participating in a protest as a student of Jawaharlal Nehru University.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X