వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీఎఫ్ వడ్డీ ఖాతాలో ఇంకా జమకాలేదా..అయితే ఎప్పుడవుతుందో తెలుసుకోండి

|
Google Oneindia TeluguNews

ముంబై: ప్రావిడెంట్ ఫండ్.. ఒక ఉద్యోగి నెల జీతంలో ఆయా సంస్థలు కొంత మొత్తాన్ని పట్టుకుని ఆ తర్వాత ఉద్యోగి అవసరమైన సమయంలో ఆ డబ్బులను వినియోగించుకోవచ్చు. ప్రావిడెంట్ ఫండ్ డబ్బులకు వడ్డీ కూడా వస్తుంది. 2018-19కి గాను దాదాపు 6 కోట్ల మంది ఉద్యోగులకు 8.65శాతం వడ్డీతో వారి పీఎఫ్ డబ్బులు అందుతాయని కార్మికశాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు. ప్రావిడెంట్ ఫండ్ వడ్డీపై నిర్ణయం తీసుకునే అత్యున్నత సంస్థలు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ)లు గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరిలో 8.65శాతంను వడ్డీగా నిర్ణయించాయి. ప్రస్తుతం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ నుండి డబ్బులు తీసుకునేవారికి వడ్డీ 8.55శాతం వేసి ఇస్తోంది. 2017-18లో దీనికి ఆమోదం తెలిపారు.

వడ్డీ రేట్లు పీఎఫ్ ఖాతాలోకి ఎలా చేరుతాయి..?

వడ్డీ రేట్లు పీఎఫ్ ఖాతాలోకి ఎలా చేరుతాయి..?

పీఎఫ్ ఖాతాదారుడి అకౌంట్‌లో ఉన్న డబ్బులపై చక్రవడ్డీ వేసి ఇస్తుంది. నెలవారీగా తమ ఖాతాలో ఉన్న డబ్బుల మొత్తం ఆధారంగా వడ్డీతో కలిపి తమ ఖాతాలో జమచేస్తుంది ఈపీఎఫ్ఓ. ప్రతినెలా సరాసరి లక్ష ఖాతాదారులు తమ డబ్బులను విత్‌డ్రా చేసుకోవడం కానీ, లేదా ఖాతాను మూసివేయడం కానీ చేస్తున్నారు. దీంతో కొన్ని లక్షల మంది ఇన్వెస్టర్లు తమ పీఎఫ్ ఖాతాలోని డబ్బులపై తక్కువ వడ్డీ పొందుతున్నారు.

వడ్డీ జమ ఎప్పుడంటే

వడ్డీ జమ ఎప్పుడంటే

ఇదిలా ఉంటే ప్రభుత్వం ఇప్పటి వరకు పెంచిన వడ్డీని ఖాతాదారులకు జమచేయలేదు. ఇది ఫిబ్రవరి నుంచి పెండింగ్‌లో ఉంది. దీంతో ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్ల స్కోర్ పై ప్రభావం చూపుతోంది. సీబీటీ సూచనలను అమలు చేసి ఉంటే చాలామంది ఉద్యోగులు దీని ద్వారా లబ్ధి పొంది ఉండేవారు. పెంచిన వడ్డీ మార్చి 31,2019లోగా ఖాతాదారుల అకౌంట్‌లో జమచేయాల్సి ఉంది.

ఈపీఎఫ్ నిబంధనలు:

ఈపీఎఫ్ నిబంధనలు:


ఈపీఎఫ్ పథకం కింద ఒక ఉద్యోగి తన వేతనంలో కొంత భాగం చెల్లించాలి. ఇక సంస్థ కొంత భాగం చెల్లిస్తుంది. ఉద్యోగం నుంచి పదవీవిరమణ పొందిన తర్వాత తను చెల్లించిన డబ్బులు, సంస్థ చెల్లించిన డబ్బులపై వడ్డీ చేరి ఒకేసారి భారీ మొత్తంలో తన ఖాతాలో డబ్బులు జమ అవుతుంది. ఒక ఉద్యోగి బేసిక్ వేతనం నుంచి 12శాతం పీఎఫ్‌గా చెల్లించాల్సి ఉంటుంది. అంతే స్థాయిలో సంస్థ కూడా చెల్లిస్తుంది. ఒక వేళ సంస్థలో 20 మంది లేదా అంతకంటే తక్కువగా ఉంటే అది ఉద్యోగి నుంచి సంస్థ నుంచి నిబంధనల ప్రకారం 10శాతం చెల్లించాల్సి ఉంటుంది.

 పీఎఫ్‌ ఎప్పుడు తీసుకోవచ్చు

పీఎఫ్‌ ఎప్పుడు తీసుకోవచ్చు


ప్రావిడెంట్ ఫండ్ ఖాతా ఉన్న ఒక ఉద్యోగి తమ డబ్బును పూర్తిగా లేదా అవసరం మేరకు తీసుకునే వెసులుబాటు ఉంది. పీఎఫ్ డబ్బులు పూర్తిగా ఇలా విత్‌డ్రా చేసుకోవచ్చు.

1) ఉద్యోగం నుంచి పదవీవిరమణ చేసినప్పుడు

2) చేస్తున్న ఒక ఉద్యోగం మానేసి మరో ఉద్యోగంలో రెండు నెలల్లోగా చేరకుంటే పూర్తి డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే తాను రెండు నెలల నుంచి ఏ ఉద్యోగం చేయడం లేదని ఒక గెజిటెడ్ ఆఫీసర్‌ నుంచి సర్టిఫికేట్ పొందుపర్చాల్సి ఉంటుంది.

3) ఒక సంస్థలో పనిచేస్తూ మరొక సంస్థలోకి మారిన సమయంలో కూడా పూర్తిగా డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే రెండు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఏ ఉద్యోగంలో చేరకుండా ఉంటే ఇది సాధ్యపడదు.

English summary
Employees who are maintaining a provident fund account, here is some good news. Soon their PF accounts will be credited with an interest of 8.65 percent, said the Labour Minister Mr.Santosh Gangwar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X