వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రయాన్ 2 ఇప్పుడు ఎక్కడుందో తెలుసా..? చంద్రుడిపైకి చేరేది ఆ తేదీనే..!

|
Google Oneindia TeluguNews

భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో రెండు రోజుల క్రితం చంద్రయాన్ -2ను విజయవంతంగా నింగిలోకి పంపింది. ఇది ఒక ఎత్తయితే ఇస్రో శాస్త్రవేత్తలకు అసలైన సవాళ్లు మున్ముందు చాలా ఉన్నాయి. అందులో ఒక సవాలును విజయవంతంగా పూర్తి చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. జూలై 22న మధ్యాహ్నం సరిగ్గా 2 గంటల 43 నిమిషాలకు నింగిలోకి నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లిన చంద్రయాన్ -2 భూకక్ష్య పరిధి పెంపు సవాలును శాస్త్రవేత్తలు విజయవంతంగా దాటుకున్నారు. అనుకున్న సమయం ప్రకారమే ఈ సవాలును మధ్యాహ్నం 2 గంటల 52 నిమిషాలకు పూర్తి చేశారు.

జీఎస్‌ఎల్‌వీ ఎంకే-3 రాకెట్ చంద్రయాన్-2ను నింగిలోకి మోసుకెళ్లింది. ఇక ఇందులో ఆర్బిటర్, విక్రమ్ అనే ల్యాండర్, ప్రగ్యాన్ అనే రోవర్‌లు ఉన్నాయి. ఒక్కసారి చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతానికి ల్యాండర్ చేరుకున్న తర్వాత అందులోని రోవర్ చంద్రుడిపై ఉన్న నీటి ఆనవాలను, అక్కడి మట్టిని ఖనిజాలను పరీక్షిస్తుంది. దీని ద్వారా చంద్రమండలంలో మనిషి మనుగడ గురించి మరిన్ని అంశాలు వెలుగు చూసే అవకాశం ఉంది.

Do you know where is Chandrayaan 2 and when is it going to land on Moon?

చంద్రయాన్ -2 చంద్రుడిపై వెళ్లేవరకు తమకున్న సవాళ్లను నెరవేర్చే పనిలో ఉంటారని ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో తొలి సవాలును బుధవారం పూర్తి చేసిందని ఇస్రో తెలిపింది. ఇక చంద్రయాన్ -2 చంద్రుడిపైకి ఆగష్టు 20 ,2019కి చేరుకుంటుందని ఇస్రో తెలిపింది. ఇక ముందస్తు ప్రణాళిక ప్రకారం చంద్రయాన్ -2 తాత్కాలిక కక్ష్యలోకి అంటే ఎర్త్ పార్కింగ్ ఆర్బిట్‌లోకి ప్రవేశింపజేస్తామని ఇస్రో పేర్కొంది. ఒక్కసారి అపాజీ గరిష్ట స్థాయికి పెరిగీ కనిష్ట స్థాయికి చేరుకోగానే గురుత్వాకర్షణ శక్తి చంద్రయాన్-2ను నిర్దిష్ట లక్ష్యం వైపు లాగేసుకుంటుందని చెప్పారు.

ఇక చంద్రయాన్ -2 చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించాక ల్యాండర్ వేరుపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక రోవర్ తన పనిని మొదలు పెడుతుందని చెప్పారు. చంద్రుడి దక్షిణ ధృవం వైపు చాలా చీకటిగా ఉంటుంది. అక్కడే రోవర్ పరిశోధనలు జరుపుతుంది. ఇప్పటి వరకు చైనా మాత్రమే చంద్రుడికి అవతల వైపునకు చాంగ్‌-4ను పంపింది. కానీ దక్షిణ ధృవం ప్రాంతానికి మాత్రం ఒక రోవర్‌ను పంపిన ఘనత భారత్‌కే దక్కుతుంది.

English summary
In a recent statement by the Indian Space Research Organisation, the Chandrayaan 2 will initiate Earthbound manoeuvres from today. In a statement released by the Indian Space Agency, here is what they said, "Earthbound manoeuvres for Chandrayaan2 spacecraft are planned to be executed from today onwards. The spacecraft is scheduled to reach Moon by Aug 20, 2019."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X