వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ గాంధీ పై కేసు పెట్టిన సెక్యూరిటీ గార్డులు ... ఎందుకో తెలుసా

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సెక్యూరిటీ గార్డుల సంఘం షాక్ ఇచ్చింది. తమ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడుతున్నారని ముంబై పోలీస్ స్టేషన్లో సెక్యూరిటీ గార్డుల సంఘం రాహుల్ గాంధీ పై ఫిర్యాదు చేసింది. ఇంతకీ రాహుల్ గాంధీ సెక్యూరిటీ గార్డ్ లను ఉద్దేశించి ఏమన్నారో తెలుసా?

మోడీని టార్గెట్ చేస్తూ చౌకీదార్ చోర్ హై అంటున్న రాహుల్

మోడీని టార్గెట్ చేస్తూ చౌకీదార్ చోర్ హై అంటున్న రాహుల్

రాఫెల్ కుంభకోణం విషయంలో ఎక్కడ ఏ సభ జరిగినా ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేసి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మోడీని ఉద్దేశించి రాహుల్ చేస్తున్న వ్యాఖ్యలు మహారాష్ట్రకు చెందిన సెక్యురిటీ గార్డుల సంఘానికి కోపం తెప్పించింది. రాఫెల్ కుంభకోణంలో భాగంగా దేశానికి కాపలాగా ఉంటానన్న వ్యక్తి దొంగగా మారాడన్న అర్థం వచ్చేలా రాహుల్ చేస్తున్న వ్యాఖ్యలపై వారు మండిపడుతున్నారు. రాహుల్ తన ప్రతి ప్రసంగంలోనూ చౌకీదార్ చోర్ హై అంటూ చేస్తున్న వ్యాఖ్యలు వింటున్న జనాలకు ఆసక్తి కరంగా అనిపించినా సెక్యూరిటీ గార్డులకు మాత్రం ఒళ్ళు మండిపోయేలా చేసింది

మనోభావాలు దెబ్బతింటున్నాయని ముంబై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

మనోభావాలు దెబ్బతింటున్నాయని ముంబై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

రాహుల్ చేస్తున్న వ్యాఖ్యలు తమ మనోభావాలు దెబ్బ తీసేలా చేస్తున్నట్లు పేర్కొంటూ సెక్యురిటీ గార్డ్ అసోసియేషన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. రాహుల్ పై కేసునమోదు చేయాలని కోరుతూ ఈ సంఘ సభ్యులు ముంబయి పోలీసుల్ని కోరారు. రాహుల్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర రాజ్య సురక్షా రక్షక్ యూనియన్సభ్యులు బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ సెక్యూరిటీ గార్డులను అవమానిస్తే వ్యాఖ్యలు చేస్తున్నారని ఖచ్చితంగా కేసు నమోదు చేసి చర్య తీసుకోవాలంటూ వారు ఫిర్యాదులో పేర్కొన్నారు .

పోలీసులు కేసు నమోదు చేస్తారా ? రాహుల్ తన వ్యాఖ్యలకు ఫుల్ స్టాప్ పెడతారా

పోలీసులు కేసు నమోదు చేస్తారా ? రాహుల్ తన వ్యాఖ్యలకు ఫుల్ స్టాప్ పెడతారా

ఈ మధ్యన ఎంఎంఆర్డీఏ మైదానంలో నిర్వహించిన సభలో రాహుల్ మాట్లాడుతూ కాపలా వ్యక్తే దొంగగా మారాడన్న వ్యాఖ్య చేశారని ఆధారాలను సైతం అందించారు. రాహుల్ పై వెంటనే కేసు నమోదు చేయాలన్న డిమాండ్ తో ఫిర్యాదు చేసిన సెక్యూరిటీ గార్డుల కంప్లైంట్ కు ముంబయి పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఒక పక్క దేశంలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ సెక్యురిటీ గార్డుల మనోభావాల్ని గౌరవిస్తూ రాహుల్ చౌకీదార్ చోర్ హై అనే వ్యాఖ్యలకు పుల్ స్టాప్ పెడతారా? లేకా కంటిన్యూ చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇలా ప్రతి మాటకు.. ఏదో ఒక సంఘం సభ్యుల మనోభావాలు దెబ్బతింటూ ఉంటే.. నేతల నోటికి తాళం వేసుకోవాల్సిందే మరి.

English summary
Rahul Gandhi's "Chowkidar chor hai" jibe against Prime Minister Narendra Modi has miffed the security guards association, which has asked Mumbai police to file a case against the Congress president, police said.The Maharashtra Rajya Suraksha Rakshak Union submitted an application at the Bandra-Kurla Complex (BKC) police station here Monday, claiming the remark was an "insult" to security guards, a police official told PTI Tuesday. The association has claimed that during his rally at the MMRDA grounds here earlier this month, Gandhi said that "chowkidar chor hai" (the guard is the thief), police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X