వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: సమయానికి రాలేదని 73ఏళ్ల వైద్యుడిని కొట్టి చంపారు

|
Google Oneindia TeluguNews

జోర్హట్: అస్సాం టీ ఎస్టేట్‌లో శనివారం కార్మికుల దాడిలో తీవ్రంగా గాయపడిన 73ఏళ్ల వైద్యుడు ఆదివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

దత్తత్రాయ ప్రస్థానం: రోహిత్ ఆత్మహత్యతో ఆరోపణలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి గవర్నర్ వరకు దత్తత్రాయ ప్రస్థానం: రోహిత్ ఆత్మహత్యతో ఆరోపణలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి గవర్నర్ వరకు

వివరాల్లోకి వెళితే.. సుక్ర మాఝీ(33) అనే టీ ఎస్టేట్ కార్మికురాలు అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను టీ ఎస్టేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు ఆమె కుటుంబసభ్యులు. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న డాక్టర్ దేబెన్ దత్తా(73) ఆస్పత్రిలో లేరు. కాంపౌండర్ కూడా సెలవులో ఉన్నారు. ఉన్న నర్సు.. సుక్ర మాఝీకి సెలైన్ పెట్టారు. అయితే, అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురైన మాఝీ ఆస్పత్రిలోనే ప్రాణాలు కోల్పోయారు.

Doctor, 73, Beaten To Death By Tea Garden Workers In Assam

దీంతో ఆగ్రహించిన ఆమె కుటుంబసభ్యులు, టీ ఎస్టేట్ కార్మికులు జోర్హట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో సదరు వైద్యుడిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఆ తర్వాత తీవ్రంగా గాయపడిన దత్తాను ఆస్పత్రిలో బంధించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి వెళ్లి వైద్యుడ్ని ఆస్పత్రికి తరలించారు.

అయితే, చికిత్స పొందుతూ వైద్యుడు దత్తా మృతి చెందారు. చెందారని సీనియర్ పోలీసు అధికారి రోషిని అపరాంజి తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. కాగా, దేబెన్ దత్తా విధుల నుంచి ఇప్పటికే రిటైరనప్పటికీ.. ఎంతో కాలంగా ఇక్కడే పనిచేస్తున్న అతడ్ని సర్వీసును పొడిగించారు.

English summary
A 73-year-old doctor who was attacked by workers of a tea estate in Assam's Jorhat district on Saturday died of injuries at a government hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X