• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మెడికల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌పై డాక్టర్ రేప్..!

|

ఢిల్లీ : డాక్టర్ దారి తప్పాడు. వృత్తి ధర్మం మరిచి కామాంధుడయ్యాడు. విధి నిర్వహణలో భాగంగా తన దగ్గరకు వచ్చిన ఓ లేడీ మెడికల్ ఎగ్జిక్యూటివ్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు ఆ సమయంలో తీసిన ఫోటోలను తన దగ్గర పెట్టుకుని పలుమార్లు బ్లాక్ మెయిల్ చేశాడు. అలా అదను చూసి అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. చివరకు సదరు డాక్టర్ వేధింపులు ఎక్కువ కావడంతో పోలీసులను ఆశ్రయించారు బాధితురాలు. దాంతో డాక్టర్‌ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఢిల్లీ సఫ్ధర్‌జంగ్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుడొకరు బరి తెగించాడు. 27 సంవత్సరాల ఓ యువతి ఫార్మా కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తుండటంతో విధి నిర్వహణలో భాగంగా సదరు డాక్టర్‌ను కలిశారు. ఆ క్రమంలో వారిద్దరు క్లోజ్ అయ్యారు. తమ కంపెనీకి చెందిన మందులు పేషెంట్లకు రిఫర్ చేయాల్సిందిగా అభ్యర్థించడంతో ఆయన ఓకే చెప్పారు. అయితే ఆయనలో కామాంధుడు దాగి ఉన్నాడనే విషయం ఆమెకు అర్థం కాలేదు.

doctor arrest for rape on lady medical sales executive in delhi

ఆ క్రమంలో వైద్యశాఖలో ఓ పోస్టు కోసం నిర్వహించే పరీక్షలకు ప్రిపేర్ కావడానికి సాయం చేస్తానని ఆమెను నమ్మించాడు. తన ఇంటిలో కొంతమంది విద్యార్థులకు ట్యూషన్స్ చెబుతున్నానని.. నీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే రావొచ్చని వల విసిరాడు. సరేనంటూ అతడు చెప్పినట్లు ఇంటికి వెళ్లింది. కానీ అక్కడ ఇతరులు ఎవరూ కనిపించలేదు. అయితే ఆమెను బుకాయించిన సదరు డాక్టర్ మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు.

ఆ కూల్ డ్రింక్ తాగి ఆమె స్పృహ కోల్పోయింది. దాంతో ఈ మానవ మృగం దారుణంగా రేప్ చేశాడు. వివస్త్రను చేసి న్యూడ్ ఫోటోలు, వీడియోలు తీసుకున్నాడు. అది జరిగిన తర్వాత కొన్ని రోజులకు సదరు ఫోటోలు, వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేశాడు. అలా గత ఐదు నెలల నుంచి ఆమెతో లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు. అయితే ఇటీవల అతడి వేధింపులు ఎక్కువ కావడంతో చివరకు పోలీసులను ఆశ్రయించారు బాధితురాలు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Doctor with the Safdurjung Hospital has been arrested after her allegedly raped a 27 year old woman repeatedly after blackmailing her with photographs of her that he had clicked. The Woman had approached the cops after which a case was registered. The Doctors phone was seized after he was arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more