వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

attack:డాక్టర్, పోలీసుపై దాడి, పరీక్షించేందుకు వస్తే రైతు ఫ్యామిలీ నో, అనుమానితుడు పరార్..

|
Google Oneindia TeluguNews

ప్రాణాలకు తెగించి మరీ విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందిపై దాడులను క్షమించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసిన కొందరిలో మార్పు రావడం లేదు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరీ కఠినచర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసినా.. గంటల వ్యవధిలోని ఓ వైద్యుడు, పోలీసు అధికారిపై రైతు, అతని కుమారుడు కలిసి దాడి చేశారు. అతని మరో కుమారుడికి పరీక్ష చేసేందుకు వెళ్తే అడ్డుకోవడమే గాక.. దాడి చేశారు. మధ్యప్రదేశ్ షియెపూర్ జిల్లా గాస్వానీ జిల్లాలో జరిగిన ఘటన ఆందోళన కలిగిస్తోంది.

వైద్యుడిపై దాడి..

వైద్యుడిపై దాడి..

గాస్వానీకి చెందిన గంగారం రైతు. ఇతనికి గోపాల్, ఆశిష్ అనే కుమారులు ఉన్నారు. గోపాల్ ఇటీవల గున జిల్లాకు వెళ్లొచ్చాడు. విజయార్ ఆస్పత్రిలో పనిచేసే వైద్యుడు పవన్ ఉపాధ్యాయ్ విషయం తెలుసుకున్నాడు. అక్కడ వైరస్ తీవ్రత ఉండటంతో.. గోపాల్‌ను పరీక్షిద్దామనుకొని ఇంటికి వెళ్లాడు. అలా ఇంటికి వెళ్లడంతో వారి నుంచి ప్రతిఘటన ఎదురైంది.

పరీక్షించేందుకు నో..

పరీక్షించేందుకు నో..

గోపాల్‌ను పరీక్షించేందుకు కుటుంబసభ్యులు అంగీకరించలేదు. అక్కడినుంచి వెళ్లిపోవాలని కోరారు. కానీ అతనికి వైరస్ ఉందేమో అనుకొని ఏఎస్సై శ్రీరామ్‌ను తీసుకొని డాక్టర్ పవన్ ఉపాధ్యాయ్ వచ్చాడు. మాటలతో చెబితే వినిపించుకోరా.. అని వారి దాడి చేశారు. గంగారం, ఆశిష్ కలిసి వారిపై దాడి చేశారు. దీంతో డాక్టర్‌కు స్వల్ప గాయం కాగా.. పోలీసు అధికారి తలకు గాయాలయ్యాయి. తర్వాత గంగారం, ఆశిష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు. కానీ సంపత్ మాత్రం అక్కడినుంచి తప్పించుకొని పోయాడు.

Recommended Video

COVID-19 : Cabinet Approves Ordinance To Protect Health Workers
ఐదో ఘటన

ఐదో ఘటన

వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం స్పష్టంచేసిన కొద్ది గంటల్లోనే ఘటన జరగడం విశేషం. ఇదేకాదు ఇదివరకు కూడా వైద్య సిబ్బందిపై దాడులు జరిగాయి. డాక్టర్, పోలీసులతోపాటు, పారిశుద్ద్య సిబ్బందిపై నాలుగుసార్లు దాడులు జరిగాయి. బుధవారం జరిగిన దాడి ఐదోది అని అధికారులు చెబుతున్నారు.

English summary
doctor working at a government hospital and a police officer were attacked today in Madhya Pradesh when they went to screen a possible patient for coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X