వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డాక్టర్‌పై భజరంగ్‌దళ్ దాడి : నడిరోడ్డుపై మోకాళ్ల మీద కూర్చోబెట్టి బహిరంగ క్షమాపణ చెప్పించారు..

|
Google Oneindia TeluguNews

ఒడిశాలో ఓ డాక్టర్‌పై భజరంగ్‌దళ్ కార్యకర్తలు దాడి చేశారు. క్లినిక్ ప్రమోషన్స్ కోసం హిందూ దేవతల చిత్రాలను వాడుకున్నందుకు అతనిపై దాడికి పాల్పడ్డారు. క్లినిక్ నుంచి అతన్ని రోడ్డు మీదకు ఈడ్చుకొచ్చి.. మోకాళ్లపై కూర్చోబెట్టి బహిరంగ క్షమాపణ చెప్పించారు. ఒడిశాలోని నబరన్‌పూర్ జిల్లా జరిగాన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

భవతోష్ మండల్ అనే ఆయుర్వేదిక్ వైద్య నిపుణుడు కొన్ని నెలల క్రితం జరిగాన్‌లో క్లినిక్ ఏర్పాటు చేశాడు. లైంగిక సంబంధిత వ్యాధులు(STDs)కి అతను చికిత్స అందిస్తున్నాడు. అయితే క్లినిక్ ప్రమోషనల్ పోస్టర్స్‌లో హిందూ దేవతల చిత్రాలను వాడటం భజరంగ్‌దళ్ కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించింది.

Doctor heckled, forced to kneel down on street for hurting religious sentiment

దీంతో క్లినిక్‌కి వెళ్లి భవతోష్‌పై దాడి చేసి అతనితో బహిరంగ క్షమాపణ చెప్పించారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘటనపై ఇప్పటికైతే తమకెలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు తెలిపారు.

వైద్యుడు భవతోష్‌కు గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతోనే ఆయన క్లినిక్‌కు వెళ్లి బహిరంగ క్షమాపణ చెప్పించాం అని కార్యకర్తలు అన్నారు. ప్రజా కోర్టు లాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో జాతీయ మీడియా ఈ ఘటనను హైలెట్ చేసింది.

English summary
An Ayurvedic doctor was dragged, made to kneel down on street and apologize in full public glare by Bajrang Dal members allegedly for hurting religious sentiments of a particular community in Jharigaon area of Nabaranpur district of Odisha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X