వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: ముస్లిం గర్భిణీని చేర్చుకోని ఆస్పత్రి వైద్యులు, అంబులెన్స్‌లోనే డెలివరీ, శిశువు మృతి

|
Google Oneindia TeluguNews

జైపూర్: రాజస్థాన్ భరత్పూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గర్భిణీ అయిన ఒక ముస్లిం మహిళను ఆస్పత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించారు. దీంతో ఆమెను మరో ఆస్పత్రిలో అంబులెన్స్‌లో తరలిస్తుండగా.. ఆమె పాపకు జన్మనిచ్చింది. అయితే, ఆ నవజాత శిశవు ప్రాణాలు కోల్పోయింది.

'నా భార్యను డెలివరి కోసం ఆస్పత్రికి తీసుకొచ్చాను. సిక్రి నుంచి జిల్లా కేంద్రంలోని జనన ఆస్పత్రికి రెఫర్ చేయడం జరిగింది. అయితే, మేము ముస్లిం కాబట్టి జైపూర్ ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు ఇక్కడ ఆస్పత్రిలో చేర్చుకోలేదు. దీంతో అంబులెన్స్ లో ఆమెను తీసుకెళుతుండగా.. పాపకు జన్మనిచ్చింది. అయితే, ఆ పాప చనిపోయింది. నా పాప మరణానికి ఆస్పత్రి వైద్యులే బాధ్యత వహించాలి' అని బాధితురాలి భర్త అన్నారు.

her child dies after delivery

ఆ గర్భిణీ మహిళ చాలా క్లిష్ట పరిస్థితిలో ఆస్పత్రికి వచ్చింది.. అందుకే ఆమెను జైపూర్ ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారు. అయితే, విషాదం జరిగిపోయింది. ఘటనపై విచారణ చేపడతామని భరత్పూర్ జనన ఆస్పత్రి ప్రిన్సిపాల్ డాక్టర్ రూపేంద్ర ఝా తెలిపారు.

రాజస్థాన్ పర్యాటక మంత్రి విశ్వేంద్ర సింగ్ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం అని ఆస్పత్రిలో చేర్చుకోరా అంటూ మండిపడ్డారు. భరత్పూర్ ఎమ్మెల్యేనే ఆరోగ్యశాఖ మంత్రిగా వ్యవహరిస్తుండటం గమనార్హం. ఆయన ఇలాకాలోనే ఇలా జరగడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది చాలా సిగ్గుపడే ఘటన అని విశ్వేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు.

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ముస్లిం అని ఆస్పత్రిలో చేర్చుకోకపోవడం దారుణమని, బాధ్యులైన డాక్టర్, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ట్విట్టర్ వేదికగా వీడియో జత చేసి ట్వీట్ చేశారు.

English summary
Doctor refuses to admit pregnant woman because she's Muslim, her child dies after delivery.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X