• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనాలో డేంజర్ గేమ్: డాక్టర్లు వర్సెస్ రాందేవ్ -జూన్ 1న బ్లాక్ డే -దేశవ్యాప్తంగా రోడ్లపైకి వైద్యులు

|

కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి తీవ్రంగా కొనసాగుతూ, వ్యాక్సిన్ల కొరత ఆందోళనకరంగా మారి, మూడో వేవ్ తలెత్తనుందనే హెచ్చరికల నడుమ దేశంలో ప్రమాదకర రాజకీయ క్రీడ కీలక మలుపు తిరిగింది. అల్లోపతి వైద్యాన్ని, వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని తీవ్రంగా అవమానిస్తూ ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా చేస్తోన్న వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ డాక్టర్లు రోడ్డెక్కనున్నారు..

జగన్‌కు భారీ షాక్: ఢిల్లీలో రఘురామ ఫిర్యాదుల పర్వం -ఎన్‌హెచ్‌ఆర్‌సీసీ పంత్‌తో భేటీ -నిర్వచనం మారితే?జగన్‌కు భారీ షాక్: ఢిల్లీలో రఘురామ ఫిర్యాదుల పర్వం -ఎన్‌హెచ్‌ఆర్‌సీసీ పంత్‌తో భేటీ -నిర్వచనం మారితే?

సామాన్యులపై కేసులు, బాబాకేమో

సామాన్యులపై కేసులు, బాబాకేమో


కరోనా వేళ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందడం లేదనో, మందులు, బెడ్లు లేవనో ఫిర్యాదు చేసినవారిపై కఠిన చట్టాల కింద కేసులు పెట్టిన బీజేపీ సర్కార్.. రాందేవ్ విషయంలో మాత్రం మౌనం వహిస్తుండటం, కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ తూతూ మంత్రపు హెచ్చరిక తర్వాత కూడా యోగా గురు వెనక్కి తగ్గకపోవడం, రోజురోజుకూ విమర్శల డోసు పెంచుతోన్న బాబా.. ‘నన్నెవడూ అరెస్టు చేయలేడు' అని బాహాటంగా ఘీకరించడం, ప్రభుత్వాల నుంచి ఎలాంటి మద్దతుగానీ, సంఘీభావంగానీ లేకపోవడంతో డాక్టర్లు నేరుగా ఆందోళనబాట పట్టారు..

వూహాన్ ల్యాబ్ లీక్: చైనా ఆర్మీకి లింకు -కరోనా గుట్టు తేలకుంటే కొవిడ్-26, కొవిడ్-32 తప్పవు: అమెరికా బాంబువూహాన్ ల్యాబ్ లీక్: చైనా ఆర్మీకి లింకు -కరోనా గుట్టు తేలకుంటే కొవిడ్-26, కొవిడ్-32 తప్పవు: అమెరికా బాంబు

జూన్ 1 బ్లాక్ డే, రోడ్లపైకి డాక్టర్లు..

జూన్ 1 బ్లాక్ డే, రోడ్లపైకి డాక్టర్లు..


అల్లోపతి వైద్య విధానం, కొవిడ్ టీకాలపై యోగా గురు బాబా రాందేవ్ చేస్తున్న విమర్శలకు నిరసనగా మంగళవారం (జూన్ 1) దేశవ్యాప్తంగా ‘బ్లాక్ డే' పాటించాలని డాక్టర్ల సంఘాటు నిర్ణయించాయి. ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఎఫ్ఓఆర్‌డీఏ) ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. ఇండియన్ మెడికల్ అసోసియేష్ (ఐఎంఏ) కూడా జూన్ 1న దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ నిరసనల వల్ల ఆస్పత్రుల్లోని రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటామని డాక్టర్ల సంఘాటు హామీ ఇచ్చాయి.

కరోనాలో డేంజర్ గేమ్..

కరోనాలో డేంజర్ గేమ్..


కరోనా విలయం ఉధృతి ఇంకా కొనసాగుతున్నా, అందరికీ వ్యాక్సిన్లు అందించకుంటే మూడో వేవ్ తప్పక వస్తుందని తెలిసినా వైరస్ పై రాజకీయాలు సాగుతున్నాయి. అల్లోపతిని ‘స్టుపిడ్ సైన్స్'గా కొట్టిపారేసిన రాందేవ్.. తనకే టీకా అవసరం లేదని, 98 శాతం రోగాలను ఆయుర్వేదం నయం చేయగలది చెప్పుకుంటున్నారు. కాగా, పతంజలి ఉత్పత్తుల అమ్మకాల కోసం రాందేవ్ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని డాక్టర్లు తిట్టిపోస్తున్నారు. కాగా, విచ్చలవిడిగా జాతీయ టీవీ ఛానళ్లలో సైతం వ్యాక్సిన్లకు, అల్లోపతికి వ్యతిరేకంగా మాట్లాడుతోన్న రాందేవ్ ను కనీసం నిలువరించే సాహసం కూడా బీజేపీ సర్కారు చేయకపోవడం కేంద్రం పెద్దలపై ఆయనుకున్న పట్టును సూచిస్తున్నదని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

English summary
A doctors' association has given a call for nationwide protest against the remarks made by yoga guru Baba Ramdev. The Federation of resident doctors' association (FORDA) issued a release in which it said that June 1 will be observed as 'Black Day'. Indian Medical Association (IMA) also calls for nationwide protest on Jun 1 over Ramdev's allopathy remarks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X