వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వర్షాలు రావడం శుభపరిణామం.. వాటితో వచ్చే వ్యాధులు చాలా ప్రమాదమే..!

|
Google Oneindia TeluguNews

గత నెల వరకు భానుడి భగభగలతో అల్లాడి పోయిన ప్రజలకు రుతుపవనాలు ప్రవేశించి కాస్త ఉపశమనం ఇచ్చాయి. ప్రస్తుతం దేశవ్యాప్తగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశంలోకి రుతుపవనాల రాక తద్వారా వచ్చే వర్షాలను స్వాగతిస్తూనే అదే సమయంలో అవి తీసుకొచ్చే వ్యాధులను గురించి కూడా హెచ్చరిస్తున్నారు వైద్యులు. భారీ వర్షాలుకు ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోవడంతో ముఖ్యంగా నగరాల్లో పలు అంటువ్యాధులు వస్తాయని చెబుతున్నారు.

 దోమల నుంచి వచ్చే వ్యాధులు

దోమల నుంచి వచ్చే వ్యాధులు

ఇక భారీ వర్షాల కారణంగా అత్యంత సాధారణమైన జబ్బులు వచ్చే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ చిన్న జబ్బులు ఏకంగా ప్రాణాలే తీయగలవని వారు చెబుతున్నారు. ఎక్కువగా పలు కీటకాల నుంచి సోకే వ్యాధుల పట్ల అత్యంత జాగ్రత్తతతో వ్యవహరించాలని చెబుతున్నారు. ఇందులో దోమల నుంచి వచ్చే వ్యాధులు అత్యంత ప్రమాదకరమైనవిగా డాక్టర్లు చెబుతున్నారు. డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా లాంటి జబ్బులు దోమల నుంచే వస్తాయి. వర్షపు నీరు పారకుండా ఒకే చోట నిల్వ అయితే అక్కడ దోమలు పెద్ద సంఖ్యలో వచ్చి చేరుతాయని.. అవి వచ్చి మనుషులను కుడితే వ్యాధులు సోకే అవకాశం ఉందని చెబుతున్నారు.

తడి ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలి

తడి ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలి

దోమలు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో అలాంటి ప్రాంతాలను గుర్తించి తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. దోమలు ఎక్కువగా తడి ఉన్న ప్రాంతాల్లో ఉంటాయని చెబుతున్నారు. తడి ప్రాంతాలే దోమలకు సంతానోత్పత్తి కేంద్రంగా మారుతాయని దీంతో దోమలు ఆ ప్రాంతాన్నే ఎంచుకుని అక్కడే ఉంటాయని చెబుతున్నారు వైద్యులు. ఇలాంటి ప్రాంతాలను గుర్తించి ఆ పరిసరాలను శుభ్రపరచాలని కోరుతున్నారు. ఇలా చేస్తే వ్యాధులు వ్యాపించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని చెబుతున్నారు పరాస్ హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్స్ విభాగంలో పనిచేసే డాక్టర్ పి. వెంకటకృష్ణన్.

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

వర్షాకాలంలో ఒక్క దోమల నుంచే కాదు.... ఇతరత్రా మార్గాల ద్వారా కూడా అంటు వ్యాధులు సోకే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇందులో కడుపులో ఇన్‌ఫెక్షన్, కామెర్లు, అతిసారం, టైఫాయిడ్, మెదడువాపు వ్యాధులు కూడా ఉంటాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు.ఇవి ఎక్కువగా అత్యంత జనసమర్దత కలిగి ఉన్న నగరాల్లో గమనిస్తూ ఉంటామని డాక్టర్ కృష్ణన్ తెలిపారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి జబ్బులు రాకుండా నివారించొచ్చని చెబుతున్నారు వైద్యులు.

జాగ్రత్తలు-సూచనలు
* శుభ్రమైన ఆహారం, శుభ్రమైన తాగునీరు తీసుకోవాలి
* రోడ్డు పక్కన దొరికే ఆహారం తగ్గించాలి. ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచిన ఆహారం తీసుకోరాదు. ఇది తీసుకుంటే అతిసారం, కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది
* వర్షాకాలంలో పరిశుభ్రతమైన ఆహారం తీసుకోవడంలో రాజీ పడొద్దు. బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేయండి
* వర్షాకాలంలో వచ్చే పలు వ్యాధులకు ద్రవపదార్థాలతో చెక్ పెట్టొచ్చు. కాబట్టి వీలైనంత ఎక్కువగా ద్రవ పదార్థాలను తీసుకోండి.
* వర్షాకాలంలో రెయిన్ బూట్లు ధరిస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే వ్యాధులను నివారించొచ్చు.
* బయటకు వెళ్లే సమయంలో మస్కిటో రిపెల్లెంట్లను వినియోగించండి. ఇంట్లో ఉన్న సమయంలో దోమతెరలను వాడటం మరిచిపోవద్దు
* చుట్టుపక్కల ఉన్న తడి ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకొని దోమల సంతానోత్పత్తి కేంద్రాలుగా మారిన ప్రదేశాలను శుభ్రపరచండి
* హ్యాండ్ శానిటైజర్‌ను ఎక్కడికి వెళ్లినా తీసుకెళ్లండి. ఏదైనా తినే ముందు శానిటైజర్‌తో ఒక్కసారి చేతులను శుభ్రపరుచుకోండి
*బయటకు వెళ్లే సమయంలో ఓ బాటిల్‌లో గోరువెచ్చని నీళ్లు తీసుకెళ్లండి. బయట నీరును తాగడం ఎంత తగ్గిస్తే అంత మంచిది

మొత్తానికి వర్షంలో ఎంత అయితే ఎంజాయ్ చేస్తామో వర్షం ద్వారా వచ్చే వ్యాధులు అంటుకున్నాయో అంతే ఇబ్బంది పడుతామని ఇందుకోసం ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాన్‌సూస్ సీజన్‌ను చక్కగా ఎంజాయ్ చేయొచ్చని డాక్టర్ కృష్ణన్ చెబుతున్నారు.

English summary
Prevention Better than cure says the doctors as this monsoon brings many diseases. Doctors are warning that if the mosquito breeding spots are not cleaned from time to time then one will fall a prey to the diseases like diarrhoea, typhoid, viral fever, and leptospirosis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X