వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ను ఇంటికి పంపిస్తాం: మోడీ, ప్రధానిపైనా విసుర్లు

|
Google Oneindia TeluguNews

ఇంఫాల్/ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రాల వెనుకబాటుతనానికి కాంగ్రెస్సే కారణమని భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. శనివారం ఈశాన్య రాష్ట్రాల్లో ప్రచారాన్ని ప్రారంభించిన మోడీ ఇంఫాల్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి చాలా గొప్పదని ఈ సందర్భంగా మోడీ కొనియాడారు.

ఈశాన్య రాష్ట్రాల ఆర్థికాభివృద్ధి కోసం ఏన్డీయే ప్రభుత్వం భారీ ప్యాకేజీ ఇచ్చిందని నరేంద్ర మోడీ గుర్తు చేశారు. ఢిల్లీలో అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన విద్యార్థి హత్య దేశానికే సిగ్గు చేటు అని మోడీ వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రాతినిథ్యం వహిస్తున్నా.. ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ వల్లే ఈశాన్య రాష్ట్రాల్లో అవినీతి పెరిగిందని నరేంద్ర మోడీ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే భారత భూభాగం పొరుగుదేశాలకు ధారాదత్తమైందని మోడీ తెలిపారు.

Does Congress think India is their personal property

కాంగ్రెస్‌ ఇంటికి పంపించేందుకు సిద్ధం: మోడీ

గౌహతి: కాంగ్రెస్ ప్రభుత్వాల వల్లే అసోం రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని నరేంద్ర మోడీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. శనివారం అసోం రాజధాని గౌహతిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

మరో వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలో కలిసిపోతుందని మోడీ అన్నారు. ఒక కుటుంబం సేవలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తరిస్తోందని ఆరోపించారు. శనివారం ఉదయం మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో బహిరంగ సభలో ప్రసంగించిన నరేంద్ర మోడీ, అనంతరం అసోం రాజధాని ఇంఫాల్ జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగే బిజెపి ర్యాలీలో పాల్గొననున్నారు.

English summary

 BJP's prime ministerial candidate Narendra Modi addressed a rally here and spoke about his fondness for Assam in his speech.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X