• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోడీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్: అసలు భారత్‌కు బుల్లెట్ రైలు అవసరమా?

|
  మోడీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్: కానీ అవసరమా?

  న్యూఢిల్లీ: భారత దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. అవసరాలకు అనుగుణంగా ముందుకు సాగుతోంది. భారత దేశం తన అభివృద్ధి ప్రణాళికలో రైల్వే వ్యవస్థను కూడా అభివృద్ధి చేస్తోంది. అందులో భాగంగా హైస్పీడ్ రైలు కారిడార్స్‌ను తీసుకు వస్తోంది. వీటినే బుల్లెట్ రైళ్లు అంటారు.

  ముంబై - అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టును ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ప్రజల భద్రత, వేగం, ఉన్నతమైన సేవల కోసం దీనిని అందుబాటులోకి తీసుకు వస్తుంది. ఈ ప్రాజెక్టు భారత దేశాన్ని ఇంటర్నేషనల్ లీడర్‌గా నిలబెట్టేందుకు ఉపయోగపడుతుంది.

   కొత్త టెక్నాలజీ రావడానికి ఇబ్బందులు

  కొత్త టెక్నాలజీ రావడానికి ఇబ్బందులు

  ఎప్పటికి అప్పుడు వచ్చే కొత్త టెక్నాలజీని తీసుకు రావడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రతిఘటన కనిపిస్తుంటుంది. కానీ చరిత్రను చూస్తే మాత్రం కొత్త టెక్నాలజీ, ముందుచూపు వల్ల దేశానికి ఎంతో మేలు జరిగినట్లుగా కనిపిస్తోంది.

  ఉదాహరణకు, 1968 రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలును చాలామంది విమర్శించారు. రైల్వే బోర్డు చైర్మన్ కూడా దానిని వ్యతిరేకించారు. అలాంటివి భారత్‌ను వెనక్కి నెట్టుతాయి. కానీ ఇప్పుడు అదే రైలులో చాలామంది ప్రయాణిస్తున్నారు.

   మరో ఉదాహరణలు

  మరో ఉదాహరణలు

  మరో ఉదాహరణ ఏమంటే మొబైల్ ఫోన్లు దేశంలోని మార్కెట్లోకి ప్రవేశించినప్పుడు చాలామంది వ్యతిరేకించారు. మొబైల్ ఫోన్లకు భారత్ సిద్ధంగా లేదని అందరూ భావించారు. ఆ సమయంలో ఫోన్ కాల్ ధర నిమిషానికి రూ.16గా ఉంది. దీనిని ధనవంతులు మాత్రమే వినియోగించేలా ఉంది. కానీ ఇప్పుడు ఫోన్‌ల వినియోగంలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. దాదాపు ప్రతి భారతీయుడికి ఒక ఫోన్ ఉంది.

   విప్లవాత్మక మార్పు

  విప్లవాత్మక మార్పు

  అలాగే, బుల్లెట్ రైలు ప్రాజెక్టు కూడా ఇప్పుడు భారత దేశానికి విప్లవాత్మక మార్పు అని భావిస్తున్నారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టు భారత దేశానికి ఎలా ఉపయోగపడుతుందో ఇక్కడ కొన్ని అంశాలు.

  తక్కువ వ్యయం గల ప్రాజెక్టు

  తక్కువ వ్యయం గల ప్రాజెక్టు

  బుల్లెట్ రైలు ప్రాజెక్టు కేవలం ప్రయాణీకులను తీసుకుపోవడమే కాకుండా భారత్ యొక్క సామర్థ్యాన్ని చాటుతుంది.

  ఈ పథకానికి రుణ సమీకరణ చేస్తారు.
  జపాన్ నుంచి రైల్వే మంత్రిత్వ శాఖకు రూ.88,000 కోట్లు ఇస్తుంది.
  తక్కువ వడ్డీ రేటుకు ఈ రుణం ఇస్తుంది. 0.1% వడ్డీతో 50 ఏళ్లపాటు రుణం తీర్చే అవకాశం ఇస్తుంది.
  రుణం తీసుకున్న తర్వాత పదిహేనేళ్ల నుంచి రుణం తీర్చడం ప్రారంభించవచ్చు.

   మేకిన్ ఇండియా విజన్ ప్రమోషన్

  మేకిన్ ఇండియా విజన్ ప్రమోషన్

  ఒప్పందం ప్రకారం మేకిన్ ఇండియా మరియు ట్రాన్సుఫర్ ఆఫ్ టెక్నాలజీ లక్ష్యాలను కలిగి ఉంది.

  ఈ ప్రాజెక్టులోకి వచ్చే పెట్టుబడులు మొత్తం భారత దేశంలో ఉపయోగించుకోవచ్చు.

   మరిన్ని ఉద్యోగాలు

  మరిన్ని ఉద్యోగాలు

  బుల్లెట్ రైలు ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇది దేశ దిశను మారుస్తుందని భావిస్తున్నారు. 2022 నాటికి భారత దేశాన్ని నమూనాగా చేయాలని పని చేస్తున్నారు. ఉద్యోగాలను కూడా ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఉద్యోగ కల్పనకు ఉపయోగపడుతుంది.

  ఈ రైల్వే ప్రాజెక్టు సమయంలో వివిధ రకాలుగా 20వేల మందికి ఉపాధి లభిస్తుంది.
  వదోదరలో హైస్పీడ్ రైలు శిక్షణా సంస్థను నెలకొల్పుతారు. ఇందులో నాలుగు వేల మందికి ఉద్యోగకల్పన ఉంటుంది.
  హైస్పీడ్ ట్రాక్ టెక్నాలజీ కోసం 300 మంది యువ ఉద్యోగులకు జపాన్ శిక్షణను ఇస్తుంది.
  ఇది దీర్ఘకాలంలో అత్యంత నైపుణ్యం, సామర్థ్యంతో పని చేసే బలాన్ని ఇస్తుంది.
  జపాన్ కొత్త శింకసేన్ టెక్నాలజీ ద్వారా మరింత వృద్ధి అవకాశాలు ఉంటాయి.

  English summary
  India is a rapidly developing economy with numerous developmental needs. A major component of India’s developmental plan is the upgradation of current rail networks as well as the development of new high speed rail corridors popularly known as bullet trains. The Mumbai – Ahmedabad High Speed Rail project, is a visionary project by the NDA Government which will herald a new era of safety, speed and service for the people, and help Indian Railways become an international leader in scale, speed and skill.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X