• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపి ప‌ట్ల రాహుల్ గాంధీ నిజంగా చ‌లించిపోయారా..??

|

అవిశ్వాస తీర్మానం సంద‌ర్బంగా టీడిపి ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ పార్ట‌మెంట్ లో ప్ర‌సంగించిన అనంత‌రం ఎఐసిసి అద్య‌క్షుడు రాహుల్ గాంధీ మాట్ల‌డుతూ ఆంద్ర‌ప్ర‌దేశ్ ప‌ట్ల వ‌ల్ల‌మాలిన‌ సానుభూతిని వ్య‌క్తం చేసారు. ఆంద్ర ప్ర‌దేశ్ వ్య‌వ‌హారాలు చూస్తుంటే క‌డుపు త‌రుక్కుపోతుంది అన్నంత రేంజ్ లో స్పందించారు. అంతే కాకుండా 21వ శ‌తాబ్ద‌వు రాజ‌కీయ ఆయుధానికి ఆంద్ర‌ప్ర‌దేశ్ బ‌లిపోయింద‌ని భారి డైలాగులు వినిపించారు. అంటే స‌మ‌యం, సంద‌ర్బం, అదికారం, ఆదిప‌త్యం క‌లిసొస్తే ఆంద్ర ప్ర‌దేశ్ ని ఆదుకుంటాం అనే సంకేతాల‌ను ఇచ్చారు. రాష్ట్రాన్ని విభ‌జించింది కాంగ్రెస్ కాబ‌ట్టి ఆయా రాష్ట్రాల లోటు పాట్లు కూడా కాంగ్రెస్ పార్టీకే తెలుస్థాయ‌నే స్థాయిలో రాహుల్ హావ‌భావాలు కురిపించారు. ఇంత‌కి 2019లో కాంగ్రెస్ పార్టీ అదికారం లోకి వ‌స్తే రాహుల్ తెలుగు రాష్ట్రాల‌కు చేయూత అందింస్తారా..? రాహుల్ మాట‌ల్లో, చూపుల్లో చూపిస్తున్న మ‌మ‌కారం కార్య‌రూపం దాల్చుతుందా..? తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!!

21వ శ‌తాబ్ద‌పు ఆయుధానికి బ‌లైన ఏపికి రాహుల్ నిజంగా సాయం అందిస్తారా..?

21వ శ‌తాబ్ద‌పు ఆయుధానికి బ‌లైన ఏపికి రాహుల్ నిజంగా సాయం అందిస్తారా..?

పార్ల‌మెంట్ లో అవిశ్వాసం తీర్మానం సంద‌ర్బంగా తెలుగు రాష్ట్రాల‌కు సంబందించి అనేక అన్ టోల్డ్ స్టోరీస్ వెలుగులోకి వ‌చ్చాయి. అనేక మంది దేశ నాయ‌కుల అభిప్రాయాలు కూడా బ‌హిర్గ‌తం అయ్యాయి. తెలుగు రాష్ట్రాల గురించి, రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల గురించి, పార్టీల గురంచి, అభివ్రుద్ది గురించి, ప్ర‌తిప‌క్షాల గురించి ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట ప‌డ్డాయి. కేంద్ర ప్ర‌భుత్వం లో అదికారం చాలాయిస్తున్న నాయ‌కుల ద‌గ్గ‌ర‌నుండి సాధార‌ణ ఎంపీల వ‌ర‌కు అనేక అభిప్రాయ‌ల‌ను వెలుబుచ్చారు. ఎవ‌రు ఎలాంటి అభిప్ర‌యం వ్య‌క్తం చేసినా అంత ప్ర‌యోజ‌నం ఉండ‌దు గాని ప్ర‌ధాన‌మంత్రి, ప్ర‌తిప‌క్ష నేత స్థాయిలో ఉన్న వ్య‌క్తుల అభిప్రాయాల‌కు మాత్రం అసాదార‌ణ విలువ ఉంటుంది.

విభ‌జించిన చేతుల‌కే న్యాయం చేయ‌డం కూడా తెలుసా..? అదే 2019లో కాంగ్రెస్ వ్యూహ‌మా..??

విభ‌జించిన చేతుల‌కే న్యాయం చేయ‌డం కూడా తెలుసా..? అదే 2019లో కాంగ్రెస్ వ్యూహ‌మా..??

పార్ల‌మెంట్ లో విభ‌జ‌న హామీల ప‌ట్ల అదికారంలో ఉన్న బీజెపి గాని, విభ‌జించిన కాంగ్రెస్ పార్టీ గాని పెద్ద‌గా స్పందించ‌క పోయిప్ప‌టికి జ‌రిగిన న‌ష్టాన్ని పూడ్చ‌డంలో ఏ పార్టీ ఎంత క్రుషి చేసింద‌నే అంశం మీద మాత్రం పెద్ద యెత్తున స్పందించారు నాయ‌కులు. విభ‌జ‌న‌కు సంబందించి చ‌ట్టంలో పొందుప‌రిచిన హామీల‌ను స‌మూలంగా నెర‌వేర్చామ‌ని అదికార బీజెపి చెప్తుంటే., చేయాల్సింది చాంతాడంత ఉంద‌ని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. అంతే కాకుండా విభ‌జ‌న‌తో న‌ష్ట‌పోయిన రాష్ట్రాల‌కు స‌రైన న్యాయం చేసేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మే న‌ని చెప్పుకొస్తున్నారు కాంగ్రెస్ నాయ‌కులు.

ఏపి ప‌ట్ల మ‌నోవేద‌న వ్య‌క్తం చేసిన రాహుల్ ఆ స్థాయిలో అండ‌గా నిలుస్తారా..??

ఏపి ప‌ట్ల మ‌నోవేద‌న వ్య‌క్తం చేసిన రాహుల్ ఆ స్థాయిలో అండ‌గా నిలుస్తారా..??

అవిశ్వాస తీర్మ‌నం సంద‌ర్బంగా పార్ల‌మెంట్ లో ఆస‌క్తిక‌ర అంశాలను వెలుగులోకి తెచ్చారు ప్ర‌ధాని మోది. ఏపి కి ప్ర‌త్యేక హోదా విష‌యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకాభిప్ర‌యం లేద‌ని తేల్చి చెప్పారు. ప్ర‌త్యేక హోదా ను కాద‌ని ప్ర‌త్యేక ప్యాకేజీకి కూడా ఒకానొక సంద‌ర్బంలో అనుకూలంగా స్పందించార‌ని గుర్తుచేసారు. లోటు బ‌డ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని విడ‌త‌ల వారీగా ఆదుకుంటున్నామ‌ని స్ప‌ష్ట‌త ఇచ్చారు. కాగా విభ‌జ‌న సంద‌ర్బంగా ప్ర‌త్యేక హోదా ప‌దేళ్లు ఇవ్వాల్సిందేన‌న్న బీజెపి నాయ‌కుడు వెంకయ్య నాయుడు స్వరాన్ని మాత్రం మోడీ తో స‌హా అంద‌రూ మ‌ర్చిపోయారు. అదికారం లోకి వ‌స్తే తాము ఏపికి ప్ర‌త్యేక హోదా ఇస్తామని చెప్తున్న రాహుల్ గాందీ వాఖ్య‌లకు నిన్న పార్ల‌మెంట్ లో మాట్లాడిన మాట‌లు బ‌లాన్నిచ్చాయి. రాహుల్ గాంధీ ఏపి ప‌ట్ల సానుకూల ద్రుక్ప‌దంతో ఉన్న‌ట్టు కూడా త‌న హావ‌భావాలు తెలియ‌జేస్తున్నాయి..

ఆంధ్ర ప్ర‌దేశ్ కి బీజేపితో ప‌ని కాదు.. ప్ర‌త్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే..

ఆంధ్ర ప్ర‌దేశ్ కి బీజేపితో ప‌ని కాదు.. ప్ర‌త్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే..

2019లో కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వ‌స్తే ఆంద్ర‌ప్ర‌దేశ్ కు మంచి జ‌రుగుతుంద‌నే సంకేతాలు వెలువ‌డుతున్నాయి. నాలుగు సంవ‌త్స‌రాలుగా ఏమి చేయ‌ని మోదీ ఇక మీద‌ట ఏదో చేస్తాడ‌నే న‌మ్మకాల‌ను కూడా ఏపి ప్ర‌భుత్వం నిన్న‌టి అవిశ్వాస తీర్మానంతో పాత‌రేసింది. ఇక ఏపి ప్ర‌భుత్వానికి మిగిలింది మోది ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా అహ‌ర్నిశ‌లు పోరాటం చేయ‌డం., కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌డం. ప్ర‌త్యేక హోదా కోసం క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని గ‌త పార్ల‌మెంట్ స‌మావేశాల్లో రాహుల్ గాంధీ తీర్మ‌నం కూడా చేసారు కాబ‌ట్టి ఏపి ప‌ట్ల సానుకూలంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఐదున్న‌ర కోట్ల ఆంద్రుల మ‌నోభావాల‌ను అర్థం చేసుకున్న రాహుల్ అందుకు త‌గ్గ‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తే గుండెల్లో గుణ‌పం దించిన ప్ర‌జ‌లే కాంగ్రెస్ పార్టీని గుండెల్లో పెట్టుకుంటారు. మ‌రి అందుకు రాహుల్ గాంధీ ఏపి ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ఏ మేర‌కు న‌డుచుకుంటారో చూడాలి.

English summary
aicc president rahul gandhi farable to ap in special status. in the parliament yesterday rahul gandhi delivered sympathetical wards towards ap. if congress comes into power in 2019, as per rahul the special will declared to ap.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X