వాలెంటైన్స్‌డే వేడుకలు: గాడిద, కుక్కకు పెళ్ళి చేసి నిరసన

Valentine's Day protest :Dog And Donkey marriage Viral
చెన్నై: వాలెంటైన్స్‌డే వేడుకలను నిరసిస్తూ భారత్ హిందూ ఫ్రంట్ కార్యకర్తలు బుదవారం నాడు చెన్నైలో వినూత్న రీతిలో నిరసనను వ్యక్తం చేశారు. కుక్కకు, గాడిదకు పెళ్ళి చేసి నిరసన వ్యక్తం చేశారు.
చెన్నై నగరంలోని చురై ప్రాంతంలో నిరసనకారులు కుక్క, గాడిదలను పూల దండలతో అలంకరించి..వాటి నుదుటిపై పసుపు రాశారు.వాలెంటైన్స్ డేకు వ్యతిరేకంగా వారు పెద్దపెట్టున నినాదాలు చేశారు.
Chennai: Bharat Hindu Front workers get a dog and a donkey married in protest against #ValentinesDay pic.twitter.com/WeG407T3YX
— ANI (@ANI) February 14, 2018
హిందూ సంప్రదాయం ప్రకారం వివాహంలో ఉపయోగించే పెళ్ళి సామాగ్రిని మహిళలు ప్లేట్లలో ప్రదర్శించారు. ఆ తర్వాత కుక్కకు, గాడిదకు వివాహం చేశారు.ఈ విషయం తెలిసిన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకొన్నారు.