వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో వైరల్: ఈ కుక్కను ఇతగాడు ఎలా హింసించి చంపాడో చూడండి..!

|
Google Oneindia TeluguNews

ఉదయ్‌పూర్: మూగజీవుల పట్ల మనిషి అరాచకం ఎక్కువైపోతోంది అనే చెప్పేదానికి ఈ ఘటనే నిదర్శనం. ఒక ముద్ద వేస్తే విశ్వాసంతో యజమాని చుట్టే తోక ఆడించుకుంటూ తిరిగే కుక్కపై ఓ వ్యక్తి పైశాచికత్వం ప్రదర్శించాడు. కుక్కను తన కారుకు కట్టేసి రోడ్డుపై కొంత దూరం ఈడ్చుకెల్లి రాక్షసానందాన్ని పొందాడు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా..?

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలో ఉన్న కేల్వా ప్రాంతంలో బాబుఖాన్ అనే వ్యక్తి తన కారుకు ఓ వీధికుక్కను కట్టేసి రోడ్డుపై కారును నడుపుకుంటూ వేగంగా వెళ్లాడు. దీన్ని కొందరు స్థానికులు తమ సెల్‌ఫోన్లతో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కారుకు వెనక భాగంలో కుక్కను కట్టేశాడు బాబుఖాన్. ఆపై కారు స్టార్ట్ చేసి క్రమంగా వేగం పెంచాడు. రోడ్డుపై కుక్కను ఈడ్చుకుంటూ తీసుకెళ్లాడు. పాపం మూగజీవి రక్తమోడుతున్నా కనికరించలేదు ఈ కసాయి మనిషి. అలానే కొంతదూరం ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఒళ్లంతా హూనం అయిపోవడంతో బాధతో గట్టిగా అరవసాగింది శునకం. అయినప్పటికీ దాన్ని విడిచిపెట్టలేదు.

Dog dragged to death after tied to a car,Video goes viral

బాధతో మొరిగిన కుక్క ఒక్కసారిగా మొరగడం ఆపేసింది. అప్పటికే తనకు తగిలిన గాయాలకు తట్టుకోలేక మృతి చెందింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా యజమాని బాబుఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. యానిమల్ యాక్ట్ కింద బాబుఖాన్‌పై కేసు నమోదు చేశారు. అయితే వీధికుక్క తన గ్యారేజీ బయట ఉండటంతో దాన్ని కట్టేసి అడవిలో వదులుదామని తీసుకెళ్లినట్లు బాబుఖాన్ చెప్పాడు. పైగా అప్పటికే అది చనిపోయి ఉందని బుకాయించాడు బాబుఖాన్. అయితే కుక్కను ఈడ్చుకెళుతున్న సమయంలో అది బతికే ఉందని దాన్ని వీడియో తీసిన స్థానికులు చెబుతున్నారు.

బాబుఖాన్ చెబుతున్నది నిజమా లేక అబద్ధమా అని తేల్చేందుకు కుక్కకు పోస్టుమార్టం నిర్వహించారు. అయితే రోడ్డుపై ఈడ్చుకెళ్లడంతోనే కుక్క షాక్‌కు గురై మృతి చెందిందని వెటిరినరీ వైద్యులు పోస్టుమార్టం నివేదికలో తెలిపారు. పోస్టు మార్టం రిపోర్టు ఆధారంగా పోలీసులు బాబూఖాన్‌ను అరెస్టు చేసి స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఈ ఘటనపై త్వరలోనే చార్జ్‌షీట్ వేస్తామని పోలీసులు తెలిపారు.

English summary
In a shocking incident, a dog was allegedly dragged to death after it was tied behind a car in Udaipur district of Rajasthan. Police have now booked the owner of the vehicle identified as Babu Khan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X