వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీలో విషాదం: హాస్పిటల్‌లోకి కుక్క... పసిబిడ్డను ఈడ్చుకెళ్లి చంపేసింది

|
Google Oneindia TeluguNews

ఆగ్రా: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ పసిబిడ్డ కళ్లు తెరిచి లోకం చూడకముందే కళ్లు మూసింది. అయితే ఏదో వ్యాధితో ఆ బిడ్డ చనిపోలేదు...హాస్పిటల్‌లోకి ప్రవేశించిన కుక్క చంపేసింది. ఈ ఘటన ఫురుఖాబాద్‌లో జరిగింది. పుట్టిన బిడ్డను కుక్క తన నోటితో కర్చుకుని ఆపరేషన్ థియేటర్‌లోకి ఈడ్చుకెళ్లి చంపేసింది. బిడ్డ తండ్రిని రవికుమార్‌గా గుర్తించారు. ఈ ఘటన సోమవారం ఉదయం ఆకాష్ గంగా హాస్పిటల్‌లో చోటుచేసుకుంది.

సోమవారం రోజున రవికుమార్ తన భార్య కంచన్ పురిటినొప్పులతో బాధపడుతుండగా ఆమెను సమీపంలోని ఆకాష్ గంగ హాస్పిటల్‌కు తీసుకొచ్చాడు. ముందుగా కంచన్‌ను పరిశీలించిన వైద్యులు ఆమెకు సాధారణ డెలివరీనే అవుతుందని భరోసా ఇచ్చారు. కానీ ఆమె పరిస్థితిని పూర్తిగా పరిశీలించాకా ఆమెకు సిజేరియన్ చేయాలని చెప్పారు. ఇక నొప్పులు ఎక్కువ అవడంతో ఆమెను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు సిబ్బంది. ఓ గంట తర్వాత కంచన ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందని వైద్యులు రవికుమార్‌తో చెప్పారు. అయితే కాసేపు ఆగాల్సిందిగా సిబ్బంది రవికుమార్‌‌కు చెప్పారు. వార్డుకు ఆమెను మార్చామని చెప్పి... బిడ్డ మాత్రం ఆపరేషన్ థియేటర్‌లోనే ఉన్నట్లు చెప్పారు.

baby killed

కొన్ని నిమిషాల తర్వాత ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన సిబ్బంది గట్టిగా కేకలు వేశారు. కుక్క ఆపరేషన్ థియేటర్‌లోకి ప్రవేశించిందని చెప్పారు. ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు కేకలు వేసుకుంటూ వచ్చిన సిబ్బందిని చూసి కంగారు పడిపోయాడు రవికుమార్. ఏమి జరిగిందో చూసేందుకు ఆపరేషన్ థియేటర్‌ వైపు పరుగులు తీశాడు. అక్కడికి వెళ్లి చూడగా ఒక్కసారిగా షాక్ అయ్యాడు రవికుమార్. అప్పుడే పుట్టిన పసిబిడ్డ రక్తపు మడుగులో పడిపోయాడు. పసిబిడ్డ గుండెలపై కుక్క గాట్లు కనిపించాయని చెప్పి కన్నీరుమున్నీరయ్యాడు.

రవికుమార్ గట్టిగా ఏడుస్తుండటంతో సిబ్బంది దగ్గరకు వచ్చి ఎవరికీ చెప్పవద్దంటూ వేడుకుంది. తనకు డబ్బులు కూడా ఇస్తామని మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. బాబు అప్పుడే పుట్టాడని కుక్క హఠాత్తుగా ఆపరేషన్ థియేటర్‌లోకి వచ్చిందని తెలిపారు. అయితే దీనిపై విచారణకు ఆదేశించారు జిల్లా కలెక్టర్. హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగినట్లు తమ విచారణలో వెల్లడైందని కలెక్టర్ మన్వేంద్ర సింగ్ తెలిపారు. హాస్పిటల్ కూడా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోందని అధికారుల విచారణలో వెల్లడైంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు హాస్పిటల్‌ను సీల్ చేయడం జరిగింది.

English summary
A stray dog in Farrukhabad, Uttar Pradesh allegedly mauled a newborn baby to death on Monday at a hospital. The dog allegedly dragged the newborn inside the operation theatre of a private hospital. The father of the baby has been identified as Ravi Kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X