వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శబరిమల దర్శనానికి భక్త శునకం: 480 కి.మీలు నడిచి భగవంతుడి సన్నిధికి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మనుషులకే కాదు పశు, పక్షాదులకు కూడా దైవ భక్తి ఉంటుందని ఇప్పటికే పలు సంఘటనలు నిరూపించాయి. తాజాగా, ఓ కుక్క కూడా ఈ జాబితాలో చేరిపోయింది. దేవుడి దర్శనం కోసం ఆ కుక్క దాదాపు 500 కిలోమీటర్లు దూరం నడవడం గమనార్హం.

480 కిలోమీటర్లు..

480 కిలోమీటర్లు..

శబరిమల అయ్యప్ప దర్శనానికి 13 మంది భక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బయల్దేరారు. వారు ఊహించని విధంగా వారికి ఓ కుక్క తోడుగా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి నుంచి కర్ణాటకలోని చిక్కమంగళూరులోని కొట్టిగెహరా గ్రామం వరకు సుమారు 480 కిలోమీటర్లకు పైగా వారి వెంట నడిచింది.

అక్టోబర్ 31 నుంచి..

అక్టోబర్ 31 నుంచి..

అక్టోబర్ 31న భక్తులు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. మొదట ఆ కుక్కను భక్తులు గమనించకపోయినప్పటికీ.. ఆ తర్వాత వారి వెంటే వస్తుండటంతో వారి దృష్టిపడింది. తమ వెంట భక్తియాత్రలో ఇది కూడా భాగస్వామ్యం అవుతోందని భావించామని భక్తులు చెప్పారు.Devotion and dedication have no bars. Be it humans or animals, love for God is universal and a stray dog has proved it. When a group of 13 Ayyappa devotees started their annual barefoot pilgrimage to Sabarimala, they never thought they would be accompanied by a dog on their way

కొత్త అనుభూతి అంటూ భక్తులు..

మేము మొదట ఆ కుక్కను గమనించలేదు. ఆ తర్వాత తమ వెంటే కొన్ని కిలోమీటర్లు రావడంతో గుర్తించాం. దీంతో దానికి తాము తినే ఆహారంలో కొంచెం పెట్టాం. తాము ప్రతీ సంవత్సరం అయ్యప్ప దర్శనానికి వెళుతున్నాం. కానీ, ఈసారి ఈ కుక్క కూడా మా వెంట రావడంతో కొంచెం కొత్త అనుభూతి కలిగిందని ఆ అయ్యప్ప భక్తులు తెలిపారు.

శబరిమలకు భక్త శునకం

శబరిమలకు భక్త శునకం

ఈ క్రమంలోనే ఆ కుక్కను శబరిమల వరకు తమ వెంట తీసుకెళ్లాలని సదరు భక్తులు నిర్ణయించుకున్నారు. ఆ కుక్క కాలికి గాయాలయ్యాయని.. దీంతో స్థానిక వైద్యులతో దానికి చికిత్స అందించామని తెలిపారు. ఆ కుక్క మెడకు లేదర్ కాలర్ కూడా ఉందని తెలిపారు. ఆ కుక్క చాలా సిగ్గరి అని భక్తులు చెప్పారు.

భారీగా తరలివస్తున్న భక్తులు

భారీగా తరలివస్తున్న భక్తులు

నవంబర్ 17న శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకోవడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తును భక్తులు అయ్యప్ప దర్శనం కోసం తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు చేపట్టారు. మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. విస్తృత ధర్మాసనానికి సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను బదిలీ చేసింది. కాగా, శబరిమలకు వచ్చే మహిళా భక్తుల భద్రత బాధ్యత తమది కాదంటూ కేరళ మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహిళా భక్తులు ఎవరూ రాకపోవడంతో శబరిమల యాత్ర ప్రశాంతంగా సాగుతోంది.

English summary
Devotion and dedication have no bars. Be it humans or animals, love for God is universal and a stray dog has proved it. When a group of 13 Ayyappa devotees started their annual barefoot pilgrimage to Sabarimala, they never thought they would be accompanied by a dog on their way
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X