వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయ్యో పాపం: 30 మందిని కాపాడిన శునకం...కానీ దాన్ని మరిచిన జనం

|
Google Oneindia TeluguNews

ఉత్తర్ ప్రదేశ్ : కుక్క విశ్వాసానికి పెట్టింది పేరని తెలుసు. ఒక ముద్ద పెట్టినందుకే ఎంతో విశ్వాసం చూపిస్తుంది శునకం. ఇప్పటికే శునకాలు పలు ప్రమాదాలను పసిగట్టి చాలా మంది మనుషుల ప్రాణాలను కాపాడిన ఉదంతాలను చూశాం. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అయితే అక్కడ మాత్రం విషాదమే మిగిలింది.

<strong>గెలుపు మూడ్‌లోకి వెళ్లిపోయిన వైసీపీ...జగన్ పీకేల ఫస్ట్ మీటింగ్‌లో ఏం జరిగింది...?</strong>గెలుపు మూడ్‌లోకి వెళ్లిపోయిన వైసీపీ...జగన్ పీకేల ఫస్ట్ మీటింగ్‌లో ఏం జరిగింది...?

విశ్వాసానికి పెట్టింది పేరు కుక్క

విశ్వాసానికి పెట్టింది పేరు కుక్క

చాలా ఇళ్లల్లో పెంపుడు కుక్కలను చూస్తూ ఉంటాం. తన ఇంట్లో వారిపైకి ఎవరన్న వస్తే చాలు సింహంలా తిరగబడుతాయి. అంత విశ్వాసంతో ఉంటాయి కుక్కలు. ప్రకృతి విపత్తులు అంటే భూకంపాలు, తుఫాన్లు, సునామీలను కుక్కలు ముందుగానే పసిగట్టగలవు. అలా పసిగట్టి చాలామంది ప్రాణాలను కాపాడిన ఘటనలు కోకొల్లు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడ ఓ కుక్క కొందరి ప్రాణాలను కాపాడింది.

 అగ్ని ప్రమాదం గమనించి కుటుంబాలను అలర్ట్ చేసిన కుక్క

అగ్ని ప్రమాదం గమనించి కుటుంబాలను అలర్ట్ చేసిన కుక్క

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ భవంతిలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బండాలోని ఓ నివాస ప్రాంతంలో ఉండే భవంతిలోని బేస్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ తర్వాత మంటలు క్రమంగా మొదటి అంతస్తుకు వ్యాపించాయి. మొదటి అంతస్తులో ఎలక్ట్రానిక్స్ మరియు ఫర్నీచర్ షోరూం ఉంది. భవంతిలోని మూడు నాల్గవ అంతస్తులో కొన్ని కుటుంబాలు నివాసముంటున్నాయి. అదే భవంతిలో ఓ కుటుంబం ఓ కుక్కను పెంచుకుంటోంది. మంటలను పసిగట్టిన కుక్క గట్టిగా మొరుగుతూ గాఢ నిద్రలో ఉన్న కుటుంబాలను అలర్ట్ చేసింది. నిద్ర నుంచి మేల్కొన్న వీరంతా ఒక్కసారిగి ఉలిక్కి పడి వెంటనే బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు.

 కట్టేసి ఉండటంతో తన ప్రాణాలు కాపాడుకోలేకపోయిన శునకం

కట్టేసి ఉండటంతో తన ప్రాణాలు కాపాడుకోలేకపోయిన శునకం

అందరినీ కాపాడిన ఆ కుక్క తన ప్రాణాలు మాత్రం కాపాడుకోలేకపోయింది. ఇంట్లోనే కట్టి ఉంచడంతో ఆ కుక్క తన ప్రాణాలను కాపాడుకోలేకపోయింది. మంటల తీవ్రతకు ఇంట్లో సిలిండర్ పేలిపోవడంతో ఆ శునకం ప్రాణాలు విడిచింది. రాత్రి సమయం కనుక కుక్కను ఇంటి యజమాని కట్టేశాడు. అయితే ఆ కుక్క మంటలను గమనించి అరిచి వారిని అలర్ట్ చేయడంతో వారు తమ ప్రాణాలను కాపాడుకునే క్రమంలో కట్టి ఉంచిన కుక్కను వదిలేసి బయటకు పరుగులు తీశారు. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు చివరి వరకు ప్రయత్నించిన ఆ కుక్క చివరకు అదే మంటల్లో చిక్కుకుని మృతి చెందింది. భవంతిలోని 30 మంది ప్రాణాలను కాపాడిన ఆ కుక్క మృతి చెందడంతో అక్కడ నివాసం ఉంటున్నవారు విషాదంలో మునిగిపోయారు.

English summary
A pet dog in Uttar Pradesh died a hero after saving at least 30 people from a devastating fire on Friday night.The fire started at the basement and first floor of an electronics and furniture showroom situated in a residential area in Banda. The families used to live at the third and fourth floors of the building.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X