వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డోక్లామ్ ఎఫెక్ట్: బీపీఎం సమావేశానికి ఇండియాకు అందని ఆహ్వనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: డోక్లామ్ వివాదం నేపథ్యంలో చైనా దేశ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఇండియా సైన్యాన్ని ఆహ్వనించలేదు. 2005 తర్వాత బీపీఎం సమావేశం జరగకపోవడం బహుశా ఇదే ప్రథమం.

ఇండియా, చైనా దేశాల మధ్య డోక్లాం వద్ద ఇటీవల కాలంలో తీవ్రమైన సమస్య ఏర్పడింది. అయితే ఈ సమస్యను రెండు దేశాలు చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకొన్నారు.

డోక్లాం వివాదాన్ని మర్చిపోదామని చైనా చెబుతున్నా.. ఆచరణలో మాత్రం అది వాస్తవరూపం దాల్చడం లేదు. సాధారణంగా దేశ ఆవిర్భావ వేడుకుల సమయంలో సరిహద్దు సైనికులతో సం‍ప్రదాయ సమావేశాన్ని ఇరుదేశాలు కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నాయి.

అయితే తొలిసారిగా డోక్లాం వివాదం తరువాత చైనా.. తమ దేశ ఆవిర్బావ వేడుకలకు భారత సైన్యాన్ని ఆహ్వానించలేదు. చైనా-భారత్‌ మధ్య మొత్తం 4,057 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ సరిహద్దులో మొత్తం అయిదు ప్రాంతాల్లో చైనా ఆవిర్భావ వేడుకల సందర్భంగా ప్రతి ఏడాది బోర్డర్‌ పర్సనల్‌ మీటింగ్‌ (బీపీఎం) జరుగుతుంది.

Doklam effect? Indian and Chinese armies skip traditional meet

భారత్‌ సైతం ఆగస్టు 15 వేడుకలకు సరిహద్దుల్లో ఉన్న చైనా సైన్యాన్ని ఆహ్వానిస్తోంది. డోక్లాం ఎఫెక్ట్‌ తరువాత ఈ ఏడాది తొలిసారిగా చైనా బీపీఎంకు భారత సైన్యాన్ని చైనా ఆహ్వానించలేదు.

భారతదేశ స్వతంత్ర వేడుకలకు సైతం బీపీఎం మీటింగ్‌కు చైనా సైన్యాన్ని ఆహ్వానించింది. ఇరు దేశాల సైనికులు ఆవిర్భావ, స్వతంత్ర వేడుకల సమయంలో కలిసి సైనిక కవాతు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇరుదేశాల మధ్య 2005 తరువాత బీపీఎం మీటింగ్‌ జరగక పోవడం ఇదే తొలిసారి.

English summary
The Indian and Chinese armies may have disengaged from their eyeball-to-eyeball confrontation on the Bhutanese territory of Doklam after hectic diplomatic parleys, but the distinct chill between the rival troops remains on the ground over a month later.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X