వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరిన్ని డోక్లాం లాంటి సమస్యలు ముందున్నాయి: చైనా కుట్రలపై ఆర్మీ చీఫ్

చైనా కుట్రలపై భారత ఆర్మీ చీఫ్ స్పందించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను మరింతగా పెంచడమే లక్ష్యంగా చైనా ప్రభుత్వం కొత్త ఎత్తులు వేస్తోందని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కీలక వ్యాఖ్యాలు చేశారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చైనా కుట్రలపై భారత ఆర్మీ చీఫ్ స్పందించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను మరింతగా పెంచడమే లక్ష్యంగా చైనా ప్రభుత్వం కొత్త ఎత్తులు వేస్తోందని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కీలక వ్యాఖ్యాలు చేశారు. డోక్లాం తరహా పరిస్థితిని మరిన్ని ప్రాంతాల్లో కల్పించాలన్న ఉద్దేశంతో సైన్యాలను బార్డర్‌లోకి పంపుతోందని అన్నారు.

భవిష్యత్తులో ఇరు దేశాల మధ్యా డోక్లాం పీఠభూమిలో ఏర్పడినటువంటి సమస్యలు రానున్నాయని తాను భావిస్తున్నట్టు ఆయన అన్నారు. వాస్తవాధీన రేఖ వెంటబడి చైనా సైన్యం మోహరించివుందని గుర్తు చేసిన ఆయన, వెంటనే తన సైన్యాన్ని చైనా వెనక్కు తీసుకోవాలన్నారు.

Doklam-like incidents may increase in future, says Army Chief

సమస్యలను పరిష్కరించుకునే దిశగా చర్చలు ప్రారంభించేందుకు ఇండియా సిద్ధంగా ఉందని అన్నారు. రెండు దేశాల సైన్యమూ వెనక్కు తగ్గేందుకు సిద్ధంగా లేదని చెప్పిన ఆయన, సరిహద్దుల్లో మోహరించిన జవాన్లు ఎదుటి దేశపు సైన్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్న పరిస్థితి నెలకొని ఉందని అన్నారు.

దేశ రక్షణ విభాగం, స్ట్రాటజిక్ స్టడీస్ ఆఫ్ సావిత్రీ బాయ్ పూలే పుణె వర్శిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇరు దేశాల సైన్యాలూ ఒకేసారి వెనక్కు వెళ్లాలన్నదే తమ అభిమతమని రావత్ వ్యాఖ్యానించారు.

English summary
Amid the ongoing standoff between the troops of India and China at Doklam in the Sikkim sector, Indian Army Chief General Bipin Rawat said that incidents like the current situation in Doklam are likely to increase in future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X