ఉద్రిక్తత: 'ఈ మంత్రంతో చైనా దెయ్యాన్ని తరిమేద్దాం, ఓడిద్దాం'
చైనాను ధీటుగా ఎదుర్కోవడానికి, చైనా దెయ్యాన్ని తరిమేసేందుకు ఓ మంత్రం పఠించండని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సూచించింది.
న్యూఢిల్లీ: చైనాను ధీటుగా ఎదుర్కోవడానికి, చైనా దెయ్యాన్ని తరిమేసేందుకు ఓ మంత్రం పఠించండని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సూచించింది.
చదవండి: సరిహద్దులో ఉద్రిక్తత: సమాచారం లేదు కాదనీ.. చైనా హింట్
'కైలాస్, హిమాలయ ఔర్ టిబెట్, చీన్ కీ అసురీ శక్తి సే ముక్త్ హో' అనే మంత్రాన్ని ప్రతి రోజు పఠిస్తే చైనా బెడద నుంచి తప్పించుకోవచ్చునని చెప్పింది.

ప్రతి భారతీయుడు తమ ఇష్ట దైవానికి ప్రార్థన చేయడానికి ముందు ఈ మంత్రాన్ని ఐదుసార్లు పఠించాలని కోరింది. అంతేకాకుండా, చైనా వస్తువుల వాడకాన్ని మానివేయాలని సూచించింది.
ఆరెస్సెస్ ప్రచారక్ ఇంద్రేష్ మాట్లాడుతూ.. ఈ చర్యల వల్ల చైనా మౌలిక ప్రయోజనాలు దెబ్బతినడంతో పాటు మనం చేసే పనిలో ఆధ్యాత్మిక శక్తి కూడా వస్తుందన్నారు.
చదవండి: మేడిన్ జర్మనీ పేరుతో భారత ఆయుధాల్లో చైనా నకిలీలు
చైనా ప్రస్తుతం కన్ఫ్యూషియిజం నుంచి దూరమైందని, సామ్రాజ్యవాద, విస్తరణవాదాన్ని అమలు చేస్తోందని మండిపడ్డారు. చైనా తీరుతో మన దేశానికి చాలామంది మిత్రులుగా మారారని, చైనా చాలామంది మిత్రులను కోల్పోయిందన్నారు.












Click it and Unblock the Notifications