gold smuggling ias officer bail released statement court customs case kerala fir arrest ed cbi accused jail nia govt CM బంగారం స్మగ్లింగ్ ఐఏఎస్ అధికారి బెయిల్ విడుదల కస్టమ్స్ కోర్టు సంబంధం కేసు కేరళ ఎఫ్ఐఆర్ శివశంకర్ అరెస్టు తిరువనంతపురం ఈడీ నిందితులు సీబీఐ జైలు ఎన్ఐఏ ప్రభుత్వం సీఎం
Gold Smuggling: ఐఏఎస్ కు బెయిల్, చేసినతప్పు, స్వప్నతో లింక్, చేతిలో నిమ్మకాయలు, సైలెంట్ !
కొచ్చి/ చెన్నై/ బెంగళూరు: దేశవ్యాప్తంగా కుదిపేసిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాజీ చీఫ్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం. శివశంకర్ జైలు నుంచి బయటకు వచ్చారు. గత ఏడాది అక్టోబర్ నెల చివరి వారంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఐఏఎస్ అధికారి శివశంకర్ ను అరెస్టు చేసి సినిమా చూపించారు. విచారణ కోసం ఆఫీసుకు పిలిపించిన ఈడీ అధికారులు శివశంకర్ ను విచారణ చేసి చివరికి అరెస్టు చేసి జైలుకు పంపించేశారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసు కింగ్ పిన్, కిలాడీ ఆంటీ స్వప్న సురేష్ దెబ్బకు ఆమెతో లింక్ పెట్టుకుని చేతిలో నిమ్మకాయలు పెట్టుకుని సైలెంగ్ గా ఉండిపోయిన సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్ కటకటాలపాలైన 98 రోజుల తరువాత జైలు నుంచి బెయల్ పై బయటకు వచ్చారు.
Illegal affair: సెక్సీ సైన్స్ టీచర్, లెక్కల మాస్టర్, స్కూల్ లో ఆ ప్రయోగాలు, మొగుడికి తెలిసి!

సార్..... షరతులు వర్థిస్తాయి
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాజీ చీఫ్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం. శివశంకర్ జైలుపాలై 98 రోజుల తరువాత షరతులతో బెయిల్ సంపాధించుకున్నారు. 2 లక్షల రూపాయల వ్యక్తిగత బాండ్, ఇద్దరు ష్యూరిటీతో శివశంకర్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అధికారుల విచారణకు పూర్తిగా సహకరించాలని, పత్రి సోమవారం విచారణ అధికారుల ముందు కచ్చితంగా హాజరు కావాలని ఐఏఎస్ అధికారి శివశంకర్ కు కోర్టు షరతులు విధించింది.

క్యాన్సర్...... పాపం చికిత్స
ఈడీ, కస్టమ్స్ అధికారుల విచారణ ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి శివశంకర్ క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొంది కోలుకుంటున్న ఐఏఎస్ అధికారి శివశంకర్ విచారణ పూర్తి అయ్యిందని అధికారులు కోర్టుకు చెప్పారు. అధికారులు సమర్పించిన నివేదిక ఆధారంగా కోర్టు శివశంకర్ కు షరతులతో బెయిల్ మంజూరు చేసింది.

గోల్డ్ స్మగ్లింగ్+ డాలర్ల స్కామ్ కేసులు
కేరళ గోల్డ్ స్మగ్లింత్ తో పాటు 1, 90, 000 యూఎస్ డాలర్లు (రూ. 1. 30 కోట్లు) విదేశీ డాలర్లు అక్రమ రవాణా కేసులో ఐఏఎస్ అధికారి శివశంకర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో గత నెలలోనే శివశంకర్ కు బెయిల్ మంజూరు అయ్యింది. అయితే డాలర్ల స్కామ్ కేసులో బుధవారం (ఫిబ్రవరి 3) కోర్టు శివశంకర్ కు బెయిల్ మంజూరు కావడంతో ఆయన కేరళలోకి కొక్కనాడ్ సబ్ జైలు నుంచి బయటకు వచ్చారు.

కిలాడీ స్వప్న ఆంటీ ఎఫెక్ట్
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టు అయ్యి జైల్లో ఉన్న స్వప్న సురేష్ తో పాటు ఆమె కుటుంబ సభ్యులతో కేరళ సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం. శివశంకర్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అధికారుల విచారణలో వెలుగు చూసింది. అనేకసార్లు స్వప్న సురేష్ కు ఐఏఎస్ అధికారి శివశంకర్ ఆర్థిక సహాయం చేశారని, ఆమెను అన్నిరకాలుగా ఆదుకున్నారని అధికారులు విచారణలో వెలుగు చూడటంతో శివశంకర్ కు సినిమా కష్టాలు ఎదురైనాయి.

సార్ కు తెలిసినా...... చేతిలో నిమ్మకాయలతో సైలెంట్
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం ముందు నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం. శివశంకర్ కు తెలిసినా ఆ విషయం బయటకు రాకుండా అధికారం దుర్వినియోగం చేశారని విచారణ చేస్తున్న అధికారులు ఆరోపిస్తున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులోని నిందితులతో ఐఏఎస్ అధికారి శివశంకర్ కు సంబంధాలు ఉన్నాయని ఇప్పటికే కస్టమ్స్ అధికారులు ఆయన్ను అనేకసార్లు విచారణ చేశారు. స్వప్న సురేష్ వ్యవహారం పూర్తిగా తెలిసినా ఏ విషయం బయటకు రానివ్వకుండా చేతిలో చల్లగా నిమ్మకాయలు పెట్టుకుని శివశంకర్ సైలెంట్ అయిపోయారని అధికారులు ఆరోపించారు.

సీఎం ఆఫీసులో కథ అడ్డం తిరిగింది ?
ఎన్ఐఏ అధికారులు గత ఏడాదిలోనే స్వప్న సురేష్ బ్యాంకు లాకర్లు సీజ్ చేశారు. గోల్డ్ స్మగ్లింగ్ ద్వారా అక్రమంగా సంపాధించిన డబ్బులు, బంగారాన్ని స్వప్న సురేష్ బ్యాంకు లాకర్లలో దాచిపెట్టారని వెలుగు చూసింది. బ్యాంకులో అక్రమ సంపాధన దాచుకోవడానికి ఐఏఎస్ అధికారి ఎం. శివశంకర్ సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు వ్యక్తిగత ప్రధాన కార్యదర్శిగా, ఆ రాష్ట్ర ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శిగా పని చేసే సమయంలోనే ఐఏఎస్ అధికారి స్వప్న సురేష్ తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారు.

సీఎంకు క్లీన్ చిట్
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఐఏఎస్ అధికారి శివశంకర్ అరెస్టు కావడంతో కేరళ సీఎం పినరయి విజయన్ రాజీనామా చెయ్యాలని కేరళలోని ప్రతిపక్షాలు పెద్దఎత్తున డిమాండ్ చేశాయి. కేరళ సీఎం పినరయి విజయన్ వ్యవహారంలో విచారణ జరిపిన అధికారులు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సీఎం పేషీకి క్లీన్ చిట్ రావడంతో కేరళ ప్రభుత్వం ఊపిరిపీల్చుకుంది.