వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘డాన్’ ఇన్నోసెంట్, నేను తప్పు చేయలేదు: ఎమ్మెల్యే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మా 'డాన్(పెంపుడు కుక్క)'కు ఏమి తెలియదు. డాన్ ఏ నేరం చేయలేదు. ఇంట్లో వాళ్లను ఎక్కడైనా పెంపుడు జంతువులు హత్య చేస్తాయా' అని ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే సోమనాథ్ భారతి ప్రశ్నించారు. కాగా, 12ఏళ్ల ఆ కుక్క.. ఇప్పుడు సోమనాథ్ భార్యపై హత్యాయత్నం కేసులో కీలకంగా మారింది.

సోమనాథ్ భారతిపై ఆయన భార్య లిపికా మిత్రా.. తనపై హత్యా ప్రయత్నం చేశారని, గృహహింసకు పాల్పడ్డారని కేసు పెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో కీలక దర్యాప్తు ప్రస్తుతం ఈ డాన్ చుట్టే తిరుగుతుంది.

ఎందుకంటే లిపికా మిత్రా ప్రెగ్నెన్సీగా ఉన్న సమయంలో తన బాస్(సోమనాథ భారతి) ఆదేశాలను పాటించి డాన్ దాడి చేసిందని, మీదపడి కరిచిందని, ముఖ్యంగా తన కడుపుపై తీవ్రగాయాలు చేసిందని, మరికొన్ని చోట్ల కూడా దారుణంగా దాడి చేసి చంపేయత్నం చేసిందని పోలీసులకు వివరించింది. దీనికి సంబంధించిన వీడియో టేపులు కూడా ఉన్నట్లు ఆమె పేర్కొంది.

Don is Innocent, Have Tapes to Prove it, Says Somnath Bharti

కాగా, ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన పోలీసులు ఈ కేసును భిన్న కోణాల్లో విచారిస్తున్నారు. అయితే, ఆ వీడియో టేపులను కావాలనే సోమనాథ భారతి మాయం చేసినట్లు కూడా ఆరోపిస్తున్నారు. ఢిల్లీ కోర్టులో అరెస్టు నుంచి ఉపశమనం పొందిన ఆయన విచారణ కోసం ఇటీవల తరచూ పోలీస్ స్టేషన్‌కు వెళుతున్నారు.

ఈ క్రమంలో ఆయన పెంపుడు కుక్కను గురించి పలు విమర్శలు వస్తున్న నేపథ్యంలో తన జీపులోని వెనుక సీట్లో డాన్‌ను తీసుకొచ్చిన ఆయన దానిని మీడియాకు చూపిస్తూ.. 'పెంపుడు జంతువులు ఎక్కడైనా ఇంట్లో వాళ్లను హత్య చేస్తాయా.. డాన్ కరుస్తాడా? చూడండి' అని ప్రశ్నించారు.

డాన్ ఎన్నోసెంట్ అని, తాను ఏ తప్పూ చేయలేదని, నిజంగా కావాలంటే తన వద్ద టేపుల ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. బెయిల్ పిటిషన్ కోసం ఆ ఆడియో టేపులను కూడా జత చేసినట్లు తెలిపారు.

ఇది ఇలా ఉండగా, సోమనాథ్ భారతి తన భార్య లిపికను రెండు సార్లు చంపేందుకు ప్రయత్నించారని పోలీసులు కోర్టుకు స్పష్టం చేశారు. ఆయన తప్పు చేసినట్లు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని ఢిల్లీ పోలీసులు అంటున్నారు. సోమనాథ్ భారతి మీద నమోదు చేసిన కేసు వివరాలను ఢిల్లీ హై కోర్టుకు సమర్పించారు.

English summary
It was presumably with a measure of irony that politician Somnath Bharti chose the name "Don", connoting machismo and virulence for a Labrador Retriever, essentially the teddy bear of dog breeds.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X