వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘ప్రమాదాల్లో ఆప్ నేతలు చనిపోయినా ఆశ్చర్యం లేదు’

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత అశుతోష్ బుధవారం తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘రోడ్డు ప్రమాదాల్లో ఆప్ నేతలు చనిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు' అని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు.

‘మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారెవరైనా మూల్యం చెల్లించాల్సిందే. అయినా మేం పోరాడుతాం' అని మోడీ ప్రభుత్వంపై అశుతోష్ ధ్వజమెత్తారు. ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ల కేసులో మంగళవారం అరెస్టయిన నేపథ్యంలో అశుతోష్ పై విధంగా స్పందించారు.

Ashutosh

అరెస్టైన అనంతరం మంగళవారం సాయంత్రం తోమర్ తన పదవికి రాజీనామా చేశారు. కాగా, ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారమే జరిగిందని పలువురు ఆప్ నేతలు ఆరోపించారు. ప్రజల చేత ఎన్నికైన ఓ ప్రజాప్రతినిధిని వేధింపులకు గురి చేస్తున్నారని ఆప్ నేత కుమార్ విశ్వాస్ అన్నారు.

‘ప్రజల చేత ఎన్నికైన ఓ ప్రజాప్రతినిధిని ఇలా ఎందుకు అరెస్ట్ చేశారు. ఎందుకు ఇంత అత్యవసరంగా అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అని విశ్వాస్ ప్రశ్నించారు.

English summary
Taking a dig at the Modi government, AAP leader Ashutosh on Wednesday took to Twitter and said: "Don't be surprised if AAP leaders are killed in road accidents."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X