వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటీఆర్‌కు పాన్ తప్పనిసరి కాదు.. ఆధారే ఆధారమన్న నిర్మలా.. ఎంతమందికి ప్రయోజనమంటే ?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : మీకు పర్మినెంట్ అకౌంట్ నంబర్ (ప్యాన్ కార్డు) లేదా .. ఐటీ రిటర్న్ ఫైల్ చేసేందుకు ఇబ్బంది పడుతున్నారా ? అయితే మీకు గుడ్ న్యూస్. ఇక నుంచి ఐటీ రిటర్న్ దాఖలు చేసేవారు ప్యాన్ నంబర్ బదులు ఆధార్ కార్డు వాడొచ్చని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్యాన్ కార్డు అవసరం ఉన్న చోట ఆధార్ నంబర్ వాడొచ్చని బడ్జెట్ ప్రసంగంలో స్పష్టంచేశారు.

ఆధారే ..
ప్రొఫెషనల్, ఆన్ ప్రొఫెషనల్‌గా ప్యాన్ నంబర్ అవసరం ఉన్న చోట ఆధార్ నంబర్ వాడొచ్చని తెలిపారామె. వివిధ సందర్భాల్లో, పలు డాక్యుమెంట్లకు ప్యాన్ బదులు ఆధార్ వాడుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో 120 కోట్ల మంది ఆధార్ కార్డు కలిగి ఉన్నారు. ప్యాన్ కార్డు ఉన్నవారు తక్కువగా ఉన్నారని గుర్తుచేశారు. అందుకే తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.

Don’t have PAN card? Use Aadhaar to file Income Tax

అభీష్టం మేరకు ..
దీంతోపాటు ఓ వ్యక్తి ఆధార్, ప్యాన్ రెండు కలిగి ఉంటే అతని ఇష్టమొచ్చిన గుర్తింపు కార్డు వివరాలు ఇవ్వొచ్చని తెలిపారు. ఆధార్ కార్డు నంబర్ ఇవ్వాలనుకున్న అందజేయొచ్చని .. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ చట్టంలో మార్పులు కూడా చేసినట్టు వివరించారు. దీంతో ప్యాన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన నుంచి ప్రజలకు మేలు జరుగుతుందని భావించారు. కొందరికీ ప్యాన్ కార్డు లేక ఇబ్బందిపడుతుంటారని గుర్తుచేశారు.

వివిధ ప్రభుత్వ పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి కరమ్‌యోగి మాందన్ పథకానికి ఆధార్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఇది వృద్ధుల కోసం ప్రవేశపెట్టిన పథకం. దీంతో దాదాపు 3 కోట్ల రిటైలర్ వ్యాపారులు, చిన్న వ్యాపారులు లాభపడుతారని పేర్కొన్నారు. అయితే వారి వార్షికాదాయం రూ.1.5 కోటి కన్నా తక్కువ ఉండాలని నిబంధన విధించారు.

English summary
aadhaar card will now double up as a PAN card for all purposes, announced Finance Minister Nirmala Sitharaman in her budget speech in Parliament Friday. While announcing the interchangeability, Finance Minister said citizens will be able to use Aadhaar card even for filing Income Tax. Aadhar number can now be used instead of PAN no wherever required. “More than 120 crore Indians now have Aadhaar. Therefore, for ease and convenience of tax payers, I propose to make PAN and Aadhaar interchangeable and allow those who do not have PAN to file Income Tax returns by simply quoting their Aadhaar number and also use it wherever they are required to quote PAN,” Sitharaman said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X