ఐటీఆర్‌కు పాన్ తప్పనిసరి కాదు.. ఆధారే ఆధారమన్న నిర్మలా.. ఎంతమందికి ప్రయోజనమంటే ?
న్యూఢిల్లీ : మీకు పర్మినెంట్ అకౌంట్ నంబర్ (ప్యాన్ కార్డు) లేదా .. ఐటీ రిటర్న్ ఫైల్ చేసేందుకు ఇబ్బంది పడుతున్నారా ? అయితే మీకు గుడ్ న్యూస్. ఇక నుంచి ఐటీ రిటర్న్ దాఖలు చేసేవారు ప్యాన్ నంబర్ బదులు ఆధార్ కార్డు వాడొచ్చని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్యాన్ కార్డు అవసరం ఉన్న చోట ఆధార్ నంబర్ వాడొచ్చని బడ్జెట్ ప్రసంగంలో స్పష్టంచేశారు.
ఆధారే ..
ప్రొఫెషనల్, ఆన్ ప్రొఫెషనల్‌గా ప్యాన్ నంబర్ అవసరం ఉన్న చోట ఆధార్ నంబర్ వాడొచ్చని తెలిపారామె. వివిధ సందర్భాల్లో, పలు డాక్యుమెంట్లకు ప్యాన్ బదులు ఆధార్ వాడుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో 120 కోట్ల మంది ఆధార్ కార్డు కలిగి ఉన్నారు. ప్యాన్ కార్డు ఉన్నవారు తక్కువగా ఉన్నారని గుర్తుచేశారు. అందుకే తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.

అభీష్టం మేరకు ..
దీంతోపాటు ఓ వ్యక్తి ఆధార్, ప్యాన్ రెండు కలిగి ఉంటే అతని ఇష్టమొచ్చిన గుర్తింపు కార్డు వివరాలు ఇవ్వొచ్చని తెలిపారు. ఆధార్ కార్డు నంబర్ ఇవ్వాలనుకున్న అందజేయొచ్చని .. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ చట్టంలో మార్పులు కూడా చేసినట్టు వివరించారు. దీంతో ప్యాన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన నుంచి ప్రజలకు మేలు జరుగుతుందని భావించారు. కొందరికీ ప్యాన్ కార్డు లేక ఇబ్బందిపడుతుంటారని గుర్తుచేశారు.
వివిధ ప్రభుత్వ పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి కరమ్‌యోగి మాందన్ పథకానికి ఆధార్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఇది వృద్ధుల కోసం ప్రవేశపెట్టిన పథకం. దీంతో దాదాపు 3 కోట్ల రిటైలర్ వ్యాపారులు, చిన్న వ్యాపారులు లాభపడుతారని పేర్కొన్నారు. అయితే వారి వార్షికాదాయం రూ.1.5 కోటి కన్నా తక్కువ ఉండాలని నిబంధన విధించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!