వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోట్ల మార్పిడి కోసం సిరా వాడొద్దు: ఈసీ అభ్యంతరం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాత నోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకున్న వారికి సిరా గుర్తు పెట్టడంపై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం తెలిపింది. కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సిరా గుర్తు వాడకంపై గందరగోళం నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది.

అందువల్ల సిరాగుర్తు వాడకాన్ని నిలిపివేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఎన్నికల సంఘం లేఖ రాసింది. పెద్దనోట్ల రద్దుతో పాతనోట్లు మార్చుకునేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు బ్యాంకుల వద్ద బారులు తీరుతున్న సంగతి తెలిసిందే.

Don’t issue indelible ink to banks till EC gives nod, DMs told

రోజులు గడుస్తున్నా బ్యాంకుల్లో బారులు తరగకపోవడంపై కేంద్రం దృష్టి సారించింది. పాతనోట్లు మార్చుకుంటున్న వారు రోజులో ఒకటి కంటే ఎక్కువ సార్లు వస్తున్నారని.. దీంతోనే బ్యాంకుల్లో రద్దీ తగ్గడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గుర్తించింది. దీన్ని నివారించేందుకు నగదు మార్పిడి చేసుకున్న వారికి సిరాగుర్తు వాడాలని నిర్ణయించింది.

ప్రస్తుత ఎన్నికల సంఘం లేఖతో సిరా గుర్తుపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు, ఉప ఎన్నికలు లేని ప్రాంతాల్లోనే సిరా గుర్తు పద్ధతిని అమలు చేయాలని, మిగితా ప్రాంతాల్లో నిలిపివేయాలని బ్యాంకులకు రిజర్వు బ్యాంకు ఆదేశాలను జారీ చేసింది.

English summary
A day after the Reserve Bank of India issued instructions to banks to use indelible ink on customers’ fingers to stop repeat money exchangers, the state election commission (SEC) has refused to provide the ink at the banks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X