వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోట్ల రద్దు: పార్లమెంటు కమిటీ ఎదుట అధికారుల 'నో ఆన్సర్' !

పెద్ద నోట్ల రద్దు అనంతరం ఎన్ని పాత నోట్లు వెనక్కి వచ్చాయి? ఎన్ని కొత్త కరెన్సీ నోట్లు ప్రింట్ చేశారు?

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం ఎన్ని పాత నోట్లు వెనక్కి వచ్చాయి? ఎన్ని కొత్త కరెన్సీ నోట్లు ప్రింట్ చేశారు? ఈ ప్రశ్నలకు ఇటు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఊర్జిత్ పటేల్ వద్ద కాని, అటు ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారుల వద్ద గాని సమాధానం లేదు.

నోట్ల రద్దు నిర్ణయంలో ఆర్బీఐ పాత్ర, నల్లధనం వసూళ్లు, విత్ డ్రా పరిమితిపై ఆంక్షలు వంటి పలు విషయాలపై సమాధానం చెప్పాల్సిందిగా పార్లమెంటు స్టాండింగ్ కమిటీ
ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారులను, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఊర్జిత్ పటేల్ ను ఆదేశించింది.

ఇదే విషయమై వివరణ ఇవ్వాల్సిందిగా ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) కూడా వారికి నోటీసులు జారీ చేసింది. అయితే, బుధవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన వీరప్ప మొయిలీ నేతృత్వంలోని పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఎదుట హాజరైన ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారులు కమిటీ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని తెలుస్తోంది.

Don't Know How Much Money Back In Banks, RBI Governor Tells MPs

ఇక ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ ది కూడా ఇదే పరిస్థితి అని సమాచారం. అసలు నోట్ల రద్దు ప్రక్రియ ఎప్పుడు మొదలైంది అన్న ప్రశ్నకు ఆయన పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది.

గతంలో ప్రధాని ప్రకటన వెలువడడానికి ఒక రోజు ముందు అంటే నవంబర్ 7న తమకు సమాచారం అందిందని చెప్పిన ఆయన మళ్ళీ మాట మార్చి.. అసలు 2014 జనవరి నెలలోనే దీనికి బీజం పడిందని, అప్పట్లో రూ.1000 నోట్లను ప్రభుత్వం పాక్షికంగా ఉపసంహరించినట్లు పేర్కొనడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

అలాగే పెద్ద నోట్ల రద్దు అనంతరం ఇప్పటి వరకు ఎన్ని పాతనోట్లు బ్యాంకులకు చేరాయో కూడా ఎవరూ చెప్పలేకపోయినట్లు తెలుస్తోంది. కనీసం ఎన్ని కొత్తనోట్లు ముద్రించారనే ప్రశ్నకూ ఎవరి వద్దా సమాధానం లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.

శుక్రవారం పీఏసీ ఎదుట...

కేవీ థామస్ అధినేతగా ఉన్న ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) ఎదుట కూడా వీరు శుక్రవారం ఇదే విషయమై హాజరు కావాల్సి ఉంది. అప్పుడు కూడా అధికారులు నోరు మెదపకపోతే.. ప్రధాని నరేంద్ర మోడీ కి సమన్లు జారీ చేయాల్సి వస్తుందని ఆయన ముందుగానే హెచ్చరించారు కూడా.

నోట్ల రద్దు అనంతరం రిజర్వ్ బ్యాంకు తన స్వతంత్రతను కాపాడుకోవడంలో విఫలమైందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు నగదు కొరతతో ప్రజలు ఇప్పటికీ నానా తంటాలు పడుతున్నారు. ఈ విషయాలన్నిటిపైన విచారణ జరుపుతున్న కమిటీల ఎదుట బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు నోరు మెదపక పోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

English summary
Reserve Bank chief Urjit Patel has told a parliamentary panel that the process of demonitisation started in January, which appeared to be in contradiction to his earlier written response to the panel that said the government "advised" the central bank to cancel high-denomination notes on November 7, a day before Prime Minister Narendra Modi announced the ban on high denomination notes of 500 and 1000 rupees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X