వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముళ్ల మధ్య పెరిగా, అందులోనే జీవిస్తున్నా: మోడీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నన్ను పూవులంత సున్నితం కానీయకండని, నేను ముళ్ల మధ్య పెరిగానని, వాటి మధ్య నా జీవనం కొనసాగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం నాడు అన్నారు. విచారంలో ఉన్న ఓ వ్యక్తి కన్నీళ్లను పూవు అంత సున్నితంగా తుడిచేందుకు నా జీవితం ఉపయోగపడితే అంతకంటే నాకు ఇంకేం కావాలన్నారు.

గాంగ్‌టక్‌లో జరిగిన రాష్ట్రాల వ్యవసాయ శాఖల మంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిక్కింలో అభివృద్ధి పరిచిన మూడు పుష్పజాతుల మొక్కలను సర్దార్ (సర్దార్ వల్లభాయ్ పటేల్), దీనదయాళ్ (దీనదయాళ్ ఉపాధ్యాయ), నమో (నరేంద్రమ ోడీ) అనే పేర్లు పెట్టడాన్ని ఆయన ప్రస్తావించారు.

Don't let me become delicate, I live among thorns, PM Narendra Modi say

వాటిని ప్రస్తావిస్తూ ప్రధాని మోడీ పై వ్యాఖ్యలు చేశారు. రెండు మొక్కలకు సర్దార్, దీనదయాళ్ అనే పేర్లను తాను సూచిస్తే మూడో మొక్కకు తన పేరును సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామలింగ్ ప్రతిపాదించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

ఇరవయ్యవ శతాబ్దంలో ఓ ప్రధానమంత్రి సిక్కింలో ఓ రాత్రి బస చేశారని, 21వ శతాబ్దంలో నేను చేస్తున్నానని ప్రధాని మోడీ చెప్పారు. ప్రతి రాష్ట్రం కూడా జిల్లాను లేదా ఓ బ్లాకును ఆర్గానిక్ ప్రాంతంగా గుర్తించాలని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు.

English summary
Don't let me become delicate, I live among thorns, PM Narendra Modi say.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X