వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆమె వల్లే, బ్రోకర్ అవసరం లేదు: జయపై అమర్ సింగ్
న్యూఢిల్లీ: సినీ నటీ, ఎంపీ జయాబచ్చన్ పైన రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ ఆదివారం తీవ్ర, ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌తో సంబంధాలు పునరుద్ధరించుకోవడానికి తనకు బ్రోకర్ అవసరం లేదని చెప్పారు. అమర్ సింగ్ తాజాగా నెట్ వర్క్ 18తో మాట్లాడారు.
ములాయం సింగ్‌కు తాను ఎప్పుడు అందుబాటులోనే ఉంటానని చెప్పారు. ఆయన వ్యక్తిగతంగా ఏది అడిగినా చేసి పెట్టానని వెల్లడించారు. ఆయనతో తన సంబంధాలు దెబ్బతినడానికి జయా బచ్చనే కారణమని బాంబు పేల్చారు.

ములాయం సింగ్ యాదవ్‌కు, తనకు మధ్య జయాబచ్న్ను ఆయన మధ్యవర్తిగా నియమించారన్నారు. అప్పటి నుంచే తమ మధ్య విభేదాలు పొడసూపాయన్నారు. తమ ఇద్దరి మధ్య నాడు ఉన్న సత్సంబంధాలకు ఏ మధ్యవర్తి, బ్రోకర్ అవసరం లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.