వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిరిండియా ప్రైవేటీకరణకు ఇది సమయం కాదు: పార్లమెంటరీ ప్యానెల్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణకు ఇది సరైన సమయం కాదని పార్లమెంటరీ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.. ఎయిర్‌ ఇండియా రుణాలను రద్దు చేసి పునరుద్ధరణకు ప్రయత్నించాలని కమిటీ సూచించింది.

ప్రభుత్వ రంగ ఎయిర్‌ ఇండియాలో మూలధన సమీకరణ దశలవారీగా చేపట్టడంతో సంస్థ ఆర్థిక, నిర్వహణ సామర్థ్యం దెబ్బతిందని కమిటీ అభిప్రాయపడింది.అధిక వడ్డీలకు రుణాలకు వెళ్లే పరిస్థితి నెలకొందని పేర్కొంది.

Don’t privatise Air India, give it 5 years to revive: parliamentary panel

ఎయిర్‌ ఇండియా విక్రయ ప్రతిపాదనను ప్రభుత్వం పునఃసమీక్షించాలని పార్లమెంటరీ కమిటీ ప్రభుత్వానికి సూచించింది. ఎయిర్‌ ఇండియాను కాపాడేందుకు ప్రత్యామ్నాయాలను ఆలోచించాలని రవాణా, పర్యాటక పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ప్రభుత్వాన్ని కోరనుంది.

ప్రకృతి వైపరీత్యాలు, భారత్‌లో విదేశాల్లో సామాజిక, రాజకీయ అశాంతి తలెత్తిన సందర్భాల్లో ఎయిర్‌ ఇండియా తన వంతు సేవలు అందించిందని కొనియాడింది. ఎయిర్‌ ఇండియా పనితీరును నీతి ఆయోగ్‌ చేసిన మాదిరి కేవలం వాణిజ్య కోణంలోనే బేరీజు వేయడం సరికాదని అభిప్రాయపడింది.

English summary
This is not an appropriate time to divest government stake in Air India, which should be given at least five years to revive and its debt written off, a parliamentary panel is likely to tell the government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X