వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ బిల్లులపై సంతకాలు చేయొద్దు: రాష్ట్రపతికి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ వినతి

|
Google Oneindia TeluguNews

చండీగఢ్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు ఆమోద ముద్ర వేయొద్దని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ విజ్ఢప్తి చేశారు. రెండు వ్యవసాయ బిల్లులు పార్లమెంట్ ఆమోదం పొందిన నేపథ్యంలో ఆ బిల్లులను వెనక్కి పంపాలని కోరారు.

రైతు చేతికి అధికారం: మద్దతు ధర కొనసాగింపు: వ్యవసాయ బిల్లులపై మోదీ హర్షం - ఆ ఎంపీలపై చర్యలు?రైతు చేతికి అధికారం: మద్దతు ధర కొనసాగింపు: వ్యవసాయ బిల్లులపై మోదీ హర్షం - ఆ ఎంపీలపై చర్యలు?

రైతులకు సంబంధించిన బిల్లులపై సంతకం చేయొద్దని రాష్ట్రపతిని కోరుతున్నా. వాటిని పునర్ పరిశీలన నిమిత్తం పార్లమెంటుకు పంపాలని వేడుకుంటున్నా.. రైతులు, కూలీలు, దళితుల శ్రేయస్సు కోసం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని వేడుకుంటున్నా అని సుఖ్‌బీర్ సింగ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Don’t sign farm bills, Sukhbir Badal urges President Ram Nath Kovind

ఈ బిల్లులు చట్ట రూపం దాల్చితే రైతులు మనల్ని క్షమించరని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఏకాభిప్రాయం అని, అణచివేత కాదని సుఖ్‌బీర్ వ్యాఖ్యానించారు. ఎన్డీఏ మిత్రపక్షమైన అకాలీదళ్.. మొదట్నుంచి ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ కేంద్రమంత్రి పదవికి హర్ సిమ్రత్ కౌర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

వ్యవసాయానికి సంబంధించిన ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్లు, ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మార్స్ సర్వీసు బిల్లులకు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం తెలుపగా, ఆదివారం రాజ్యసభ కూడా ఆమోదించింది. ఇక రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లులు అమలులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో సుఖ్బీర్ సింగ్ బాదల్ రాష్ట్రపతికి లేఖ రాశారు.

Recommended Video

Agriculture Bills 2020 : Ysrcp Supports And Congress Denis Bill In Loaksabha

పార్లమెంటులో ఈ బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్ర నిరసనలు ప్రదర్శనలు చేపట్టాయి. గందరగోళం సృష్టించాయి. రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ మైక్ ను కూడా కొందరు సభ్యులు లాగేసేందుకు ప్రయత్నించారు దీంతో అనుచితంగా ప్రవర్తించిన సభ్యులపై చర్యలు తీసుకునేందుకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో డిప్యూటీ ఛైర్మన్ సహా, పలువురు మంత్రులు పాల్గొన్నట్లు సమాచారం.

English summary
Shiromani Akali Dal (SAD) chief Sukhbir Singh Badal has requested President Ram Nath Kovind not to give his assent to the two farm-related bills brought by the Centre. These bills were passed in the Lok Sabha following heated deliberation on September 17.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X