వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2జీ స్కాంపై మన్మోహన్ ఇలా, అలాగే చేయండి.. స్వీట్లు పంచిన స్టాలిన్

|
Google Oneindia TeluguNews

Recommended Video

2G spectrum scam : 2జీ స్కాం: డీఎంకే సంబరాలు, వీడియో !

న్యూఢిల్లీ: యూపీఏ 2 హయాంలో వెలుగు చూసిన 2జీ కుంభకోణంలో నిందితులందరినీ గురువారం పాటియాలా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషులుగా తీర్పు చెప్పింది. దీనిపై మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ స్పందించారు.

2జీ కేసు: తానే వాదనలు వినిపించిన ఏ రాజా, 2జీ తీర్పుపై కరుణానిధి ఇలా2జీ కేసు: తానే వాదనలు వినిపించిన ఏ రాజా, 2జీ తీర్పుపై కరుణానిధి ఇలా

కోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వంపై విష ప్రచారం జరిగిందని ఆయన వాపోయారు. ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, అది తాజాగా కోర్టు తీర్పుతో స్పష్టమయిందని తెలిపారు. దీని గురించి నేను ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదని, తీర్పు చెబుతుందన్నారు.

 చారిత్రాత్మక తీర్పు

చారిత్రాత్మక తీర్పు

2జీ సుంభకోణం కేసులో కనిమొళి సహా నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక తీర్పు అని ఉత్సహంగా చెప్పారు. తీర్పు వెలువడగానే చెన్నైలోని స్టాలిన్, కనిమొళి నివాసాల ముందు కార్యకర్తలు బాణసంచా పేల్చారు. ఢిల్లీలోని పాటియాలా కోర్టు వెలుపల కూడా కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

 మిఠాయిలు పంచిన స్టాలిన్

మిఠాయిలు పంచిన స్టాలిన్

స్టాలిన్ స్పందన కోసం ఆయన ఇంటికి చేరుకున్న మీడియా సిబ్బందికి స్టాలిన్ స్వయంగా స్వీట్లు పంచి పెట్టారు. తీర్పు డీఎంకేను నాశనం చేసేందుకు కేసు పెట్టారని, పార్టీ ఎలాంటి తప్పు చేయలేదని కోర్టు తీర్పుతో తేటతెల్లమయిందని వెల్లడించారు.

 అంతే ఉత్సాహంగా ప్రజల్లోకి తీసుకెళ్లండి

అంతే ఉత్సాహంగా ప్రజల్లోకి తీసుకెళ్లండి

అన్ని కుంభకోణాల విషయంలో మీడియా ఎంత ఉత్సాహంగా పని చేసిందో అంతే ఉత్సాహంగా కోర్టు ఇచ్చిన తాజా తీర్పును కూడా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించింది.

వినోద్ రాయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

వినోద్ రాయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

పాటియాలా కోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కాగ్ మాజీ వినోద్ రాయ్‌పై నిప్పులు చెరుగుతున్నారు. ఆయన జాతికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత మనీష్ తివారి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు కూడా ఆయనపై విరుచుకుపడుతున్నారు.

English summary
Top Congress leaders have said today's verdict in the 2G case has vindicated the party's stand that there was no scam in the allotment of second generation or 2G licences during former Prime Minister Dr Manmohan Singh's Congress-led UPA government at the centre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X