వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధికారం ఉంటే కొమ్ములొస్తాయా: ఆర్డీఓపై చిందులేసిన ఎమ్మెల్యే..వీడియో వైరల్

|
Google Oneindia TeluguNews

లక్నో: అధికారంలో ఉన్నాం కదా అని రెచ్చిపోతున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. అధికారులపై ప్రతాపం చూపుతూ దూషణలకు దిగుతున్నారు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతేపూర్ సీక్రీ బీజేపీ ఎమ్మెల్యే ఉదయ్‌భాన్ చౌదరి ఆర్డీఓ గరీమా సింగ్‌ను దూషించిన ఘటన వెలుగు చూసింది. మహిళా అధికారిని దూషిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రైతుల సమస్యలపై ఉదయ్‌భాన్ చౌదరి ఆర్డీఓను కలిసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆర్డీఓ గరీమా సింగ్‌పై తిట్లపురాణం అందుకున్నాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రజాస్వామ్యంలో తన పవర్ ఏమిటో చూపిస్తానని ఉదయ్‌భాన్ చౌదరి అన్నారు. "నేను ఎలాగైతే మాట్లాడుతున్నానో నాతో సమానంగా మాట్లాడుతావా... అంటే నీవు ఆర్డీఓ అని నాకు చెప్పదలుచుకున్నావా... నేను ఒక ఎమ్మెల్యేను. ఆవిషయాన్ని గుర్తు పెట్టుకో... నాతో ఎలా మాట్లాడాలో ముందుగా నేర్చుకో. నా పవర్ గురించి నీకు ఇంకా తెలియనట్లుంది. ప్రజాస్వామ్యంలో నా పవర్ ఏంటో ముందు తెలుసుకోవాలి" అని చౌదరి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

‘Don’t you know my power?’: BJP MLA threatens officer on camera

ఆవు చేను మేస్తే దూడ గట్టు మేస్తుందా అన్నట్లుగా... నాయకుడు గరీమా సింగ్‌పై పెద్ద ఎత్తున ధ్వజమెత్తితే అతని అనుచరులు ఊరుకుంటారా.. వారు కూడా తలో మాట గరీమా సింగ్‌ను అన్నారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ సమయంలో గరీమా సింగ్ మౌనం వహించడం తప్ప ఏమి చేయలేకపోయారు. ఘటన తర్వాత తనపై అసభ్య పదజాలాన్ని ఎమ్మెల్యే చౌదరి ప్రయోగించాడని ఆమె మీడియా ద్వారా తెలిపింది. అంతకుముందు కూడా ఉత్తర్ ప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ బాజ్‌పేయి కూడా అలహాబాద్ ఎస్పీపై ఒంటికాలుతో లేచారు.

English summary
Fatehpur Sikri's BJP MLA Udaybhan Chaudhary on Monday threatened a Sub-divisional magistrate (SDM) Garima Singh.Bharatiya Janata Party (BJP) legislator Chaudhary had gone to meet the SDM over farmers' issue.In the video of the verbal spat between the legislator and the administrative official, Chaudhary could be seen reminding SDM Singh about his 'powers' under the rule of democracy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X