వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెనక్కి తగ్గేది లేదు.. ముస్లింలను అడుగుపెట్టనివ్వను : డొనాల్డ్ ట్రంప్

|
Google Oneindia TeluguNews

వివాదస్సద వ్యాఖ్యల నుంచి ఏ మాత్రం వెనక్కు తగ్గడానికి ఇష్టపడట్లేదు అమెరికా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్. అనుకున్నట్టుగానే అమెరికన్ అధ్యక్ష ఎన్నికల కోసం రిపబ్లికన్ పార్టీ తరుపున ట్రంప్ నామినేషన్ పొందారు. దీంతో పలు మీడియా ఛానెళ్లు ఆయన్ను పలకరించే ప్రయత్నం చేయగా.. తాను గతంలో చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని, అది తనకు నష్టం కలిగించేదిగా మారిన తాను లెక్క చేయనని స్పష్టం చేశారు.

తాజాగా ముస్లింలపై మరోసారి విరుచుకుపడ్డ ట్రంప్.. ముస్లింలను అమెరికాలో అడుగుపెట్టనివ్వకుండా నిషేధం విధించే చట్టం తీసుకొస్తానన్నారు. అక్రమ వలసదారులందరిని అమెరికా అవతలకు పంపించాల్సిందేనని, అమెరికా నుంచి వాళ్లందరిని బహిష్కరిస్తానని ప్రకటించారు. ముస్లింలకు అమెరికాలో చోటు లేదని చెప్పిన ట్రంప్.. అదే సమయంలో ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ముస్లిం దేశాలతో కలిసి పనిచేస్తానని పేర్కొనడం గమనార్హం.

 donald trump again targeted muslims

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఎంఎస్ఎన్‌బీసీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రంప్.. డాక్యుమెంటేషన్ సరిగా లేని ఎంతోమంది అమెరికాలో చొరబడుతున్నారు. వాళ్లంతా దేశంలో ఎక్కడెక్కడ ఉంటున్నారో తెలియదన్నారు. అమెరికా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పిన ట్రంప్, ముస్లిం అయినా.. ఇంకొకరైనా తన వైఖరిలో మార్పు ఉండదని తెలిపారు. తాను కామన్ సెన్స్ తో పనిచేస్తానని చెప్పిన ట్రంప్, ఏం చేయాలో తనకు తెలుసని, తాను సరైన దారిలోనే వెళ్తున్నానని తెలియజేశారు.

ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న మరో నేత హిల్లరీ క్లింటన్ ట్రంప్ వ్యాఖ్యలను ఖండించారు. అధ్యక్ష హోదాలోకి వచ్చే వ్యక్తి విభజనాత్మక ధోరణితో వ్యవహరించడం దేశ ప్రజలు సమ్మతించబోరని చెప్పారు. ముస్లింలపై, వలసదారులపై ట్రంప్ వ్యాఖ్యలు సరికాదని మండిపడ్డారు క్లింటన్. లాటినో ఔట్ రీచ్ జాతీయ డైరెక్టర్ లొరెల్లా ప్రయేలీ కూడా ట్రంప్ వ్యవహారాన్ని దుయ్యబట్టారు. రిపబ్లికన్ నామినేషన్ సాధించి 24 గంటలు గడవకముందే ట్రంప్ తన
విదేశాంగ విధానాలను గురించి స్పష్టంగా చెప్పారని, ఆయన పాలనలో లాటినోలకు, ముస్లింలకు, ఇతర వర్ణాల వారికి స్వేచ్చ ఉండే అవకాశం లేదన్నారు.

English summary
america republican party member donald trump again targeted muslims. adding fire to that he said there is no space for muslims in america
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X