వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వచ్చే రిపబ్లిక్ డేకు ముఖ్య అతిథిగా డొనాల్డ్ ట్రంప్!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికాతో మరింత సత్సంబంధాలు కొనసాగించేందుకు వచ్చే ఏడాది గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను భారత్ ఆహ్వానించినట్లు తెలిసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ట్రంప్‌కు ఆహ్వానం పంపించిందని, దీనిపై ట్రంప్‌ యంత్రాంగం సానుకూలంగా స్పందించిందని సమాచారం.

భారత్‌ ఆహ్వానాన్ని అంగీకరించి వచ్చే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైతే.. ట్రంప్‌ ఈ వేడుకకు హాజరైన రెండో అమెరికా అధ్యక్షుడు అవుతారు. 2015లో అప్పటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే.

Donald Trump Invited to be Chief Guest at Next Years Republic Day Parade: Report

అమెరికా ఇతర దేశాల ఉత్పత్తుల దిగుమతులపై సుంకం పెంచుతూ వాణిజ్య యుద్ధానికి తెర లేపడం, ఇరాన్‌ నుంచి చమురు దిగుమతిని ఆపేయాలని భారత్‌ను అమెరికా హెచ్చరిస్తున్న సమయంలో ట్రంప్‌ను ఆహ్వానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల అమెరికా, భారత్‌ల మధ్య జరగాల్సిన 2+2 చర్చలు కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే.

కాగా, గత గణతంత్ర దినోత్సవ వేడుకలకు పది ఏషియాన్‌ దేశాల ప్రతినిధులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసమే భారత్‌ వారిని ఆహ్వానించింది.

English summary
US President Donald Trump has been invited as the chief guest for next year’s Republic Day parade. The invitation was sent in April and the Trump administration has indicated that it is favourably considering the proposal, a Times of India report said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X