వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న ట్రంప్.. అవసరంలేదని మరోసారి తేల్చిచెప్పిన భారత్..

|
Google Oneindia TeluguNews

Recommended Video

'If They Want Me To Intervene...': Donald Trump Rakes Up Kashmir Again

ఢిల్లీ : కాశ్మీర్ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కాంట్రవర్శియల్ కామెంట్లు చేశఆరు. భారత్ - పాక్ కోరితే కాశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌‌తో భేటీ సందర్భంగా ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా భారత్ తీవ్రంగా ఖండించింది. కాశ్మీర్ సమస్య ద్వైపాక్షిక అంశమని ఈ విషయంలో మూడో వ్యక్తి జోక్యం అవసరంలేదని స్పష్టం చేసింది. అయినా ఆ మాటల్ని పట్టించుకోని ట్రంప్ మళ్లీ అలాంటి కామెంట్లు చేశారు. దీనికి తోడు భారత్ ఖండించిన విషయం తనకు తెలియదన్నట్లుగా కవరింగ్ ఇచ్చారు.

గొంతులోతు వరదనీరు.. టబ్‌లో పసిపాపను పడుకోబెట్టి ప్రాణాలు కాపాడిన పోలీసు..గొంతులోతు వరదనీరు.. టబ్‌లో పసిపాపను పడుకోబెట్టి ప్రాణాలు కాపాడిన పోలీసు..

మధ్యవర్తిత్వానికి సిద్ధమని ప్రకటన

మధ్యవర్తిత్వానికి సిద్ధమని ప్రకటన

కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వంపై భారత స్పందనను ప్రస్తావించిన జర్నలిస్ట్ ట్రంప్‌కు ప్రశ్న సంధించారు. దీనిపై స్పందించిన అమెరికాప్రెసిసిడెంట్ ఈ విషయంపై నిర్ణయాన్ని భారత ప్రధాని మోడీకే వదిలేస్తున్నామని అన్నారు. అంతటితో ఆగకుండా తన మధ్యవర్తిత్వ ప్రతిపాదనకు భారత్ అంగీకరించిందా లేదా అని జర్నలిస్టులనే ప్రశ్నించారు. తనకు తెలిసినంత వరకు మోడీ, ఇమ్రాన్ ఖాన్‌లు అద్భుతమైన వ్యక్తులన్న ట్రంప్.. వారి మధ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ వారు కాశ్మీర్ విషయంలో ఎవరైనా జోక్యం చేసుకోవాలని భావిస్తే దానికి తాను సిద్ధంగా ఉన్నామని ట్రంప్ ప్రకటించారు.

మూడో దేశం జోక్యం అవసరంలేదన్న భారత్

మూడో దేశం జోక్యం అవసరంలేదన్న భారత్

డొనాల్డ్ ట్రంప్‌ వ్యాఖ్యలపై భారత్ మళ్లీ స్పందించింది. భారత్ - పాకిస్థాన్ మధ్య నెలకొన్న వివాదాలను రెండు దేశాలే పరిష్కరించుకోవాలన్న విధానానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. ఈ అంశంలో మూడో దేశం ప్రమేయాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. భారత విదేశాంగ మంత్రి జై శంకర్ అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియోతో జరిగిన భేటీలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. భారత్, పాక్ ద్వైపాక్షిక చర్చల్లో ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అనుమతించబోమని తేల్చి చెప్పారు. భేటీ అనంతరం భారత విదేశాంగ శాఖ ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది. ప్రధాని నరేంద్రమోడీ ఆదేశాల మేరకు ఈ ప్రకటన జారీ చేసినట్లు సమాచారం.

గతంలో నోరుజారిన ట్రంప్

గతంలో నోరుజారిన ట్రంప్

గత నెలలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో భేటీ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోరుజారారు. కాశ్మీర్ సమస్య పరిష్కారం విషయంలో ప్రధాని నరేంద్రమోడీ మధ్యవర్తిత్వం వహించమని కోరారని చెప్పారు. దీనిపై పెను దుమారం రేగడంతో ట్రంప్ వ్యాఖ్యల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. మోడీ - ట్రంప్ భేటీ సందర్భంగా అసలు ఆ అంశం చర్చకురాలేదని చెప్పింది. భారత్ తీవ్రంగా స్పందించడంతో వెనక్కి తగ్గిన అమెరికా మోడీ అమెరికా సాయం కోరలేదని, అవసరమైతే మధ్యవర్తిత్వానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది.

English summary
US President Donald Trump said it was up to India and Pakistan to resolve the Kashmir issue but he was ready to assist if the two countries wanted him to help in resolving the decades-old dispute.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X