వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియా ఝలక్: అందులో అమెరికా వెనుకబడిందన్న ట్రంప్ గూడచారి

భారత్ ఒకే రాకెట్ లో 104 ఉపగ్రహాలను పంపడంతో అమెరికా అధ్యక్షుడు తన అత్యున్నత గూఢచారి విభాగానికి అధిపతిగా నియమించుకొనేందుకుగాను ఎంపిక చేసుకొన్న డాన్ కోట్స్ షాక్ అయ్యారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్:భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఒకేసారి 104 ఉపగ్రహలను ఒకే రాకెట్ తో అంతరిక్షంలోకి పంపిన విషయం తెలుసుకొని షాకయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యున్నత గూఢచార అధికారిగా ఎంపిక చేసుకొన్న మాజీ సెనెటర్ డాన్ కోట్స్ .

మాజీ సెనెటర్ డాన్ కోట్స్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్ ఒకేసారి వందకు పైగా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిందని తెలిసి ఈ విషయంలో అమెరికా ఇంకా వెనుకబడిందని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే ఈ ఉప గ్రహాలు పరిణామంలో చిన్నవి కావచ్చు. రకరకాల పనులు చేయవచ్చు. కానీ, ఓక్క రాకెట్ లో అన్నింటిని పంపడం అంటే చిన్న విషయం కాదన్నారు.తొలుత తాను బహుశా 104 వేదిక మీద నుండి అన్నింటిని ప్రయోగించి ఉంటారనుకుంటానని కోట్స్ చెప్పారు.

 Donald Trump's spymaster pick 'shocked' to know India launched 104 satellites in one go

సిఐఏ సహ అమెరికాలోని అన్ని గూఢచార వ్యవస్థలకు అధిపతిగా ఆయన త్వరలోనే నియమితులుకానున్నారు.అయితే ఇస్రో సాధించిన ఈ విజయం గురించి అంతా అయిపోయేవరకు ఆయనకు తెలియదు.

ఫిబ్రవరి 15వ, తేదిన ఇస్రో ఆంద్రప్రదేశ్ లోని శ్రీహరి కోట నుండి రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. మూడు భారత ఉపగ్రహాలు కాగా, 96ఉపగ్రహాలు ఇతర దేశాలకు చెందినవి.

English summary
US President Donald Trump’s top spymaster nominee has said he was “shocked” to read that India successfully launched more than 100 satellites in one go last month. “I was shocked the other day to read that India, on one rocket launch, deposited more than 100 satellites in space,” former Senator Dan Coats told lawmakers on Tuesday during his confirmation hearing for the position of Director of National Intelligence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X