వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బరాక్ ఒబామా చూడని భారత్.. ట్రంప్ చూస్తున్నారు: మోడీ వల్లేనంటూ సత్య నాదెళ్లతో ముకేశ్ అంబానీ

|
Google Oneindia TeluguNews

ముంబై: బ్రాండ్ న్యూ ఇండియా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్వాగతం పలుకుతోందని పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అన్నారు. భారతదేశం ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా అవతరించే దిశలో పయనిస్తోందన్నారు. ప్రపంచంలో మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇంత అద్బుత ఆతిథ్యం ఎక్కడా చూడలేదు: ఫొటోలు, వీడియోలతో డొనాల్డ్ ట్రంప్ సీనియర్ అధికారిఇంత అద్బుత ఆతిథ్యం ఎక్కడా చూడలేదు: ఫొటోలు, వీడియోలతో డొనాల్డ్ ట్రంప్ సీనియర్ అధికారి

మోడీ వల్లే డిజిటల్ ఇండియా..

మోడీ వల్లే డిజిటల్ ఇండియా..

ముంబైలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో నిర్వహించిన ఫ్యూచర్ డీకోడ్ సీఈవో సమావేశంలో ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. ఈ ప్రభావం మొబైల్ నెట్‌వర్క్ విపరీతంగా పెరగడంతోపాటు గతంలో ఎన్నడూ చూడనంత వేగంగా విస్తరించడం వల్లేనని అన్నారు. ఇదంతా 2014లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన డిజిటల్ ఇండియా వల్లేనని తెలిపారు.

Recommended Video

Namaste Trump : On Day 2 Modi and Trump Get Down To Business | Oneindia Telugu
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్..

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్..

ప్రపంచంలోని అతిపెద్ద మూడు ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. అయితే, ఇది సాకారమయ్యేందుకు ఐదేళ్లు లేక పదేళ్లు పడుతుందా? అనేదే చర్చనీయాంశమన్నారు. 380 మిలియన్ల మంది ప్రజలు జియో 4జీ టెక్నాలజీ వైపు మళ్లారని ముకేశ్ అంబానీ తెలిపారు. ఫ్రీ జియో డేటా స్పీడ్ 256 కేబీపీఎస్ ఉండగా, పోస్ట్ జియో వేగం 21 ఎంబీపీఎస్‌గా ఉందని ఆయన వివరించారు.

గత అధ్యక్షులు చూడని భారత్.. ట్రంప్ చూస్తున్నారు

గత అధ్యక్షులు చూడని భారత్.. ట్రంప్ చూస్తున్నారు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనపైనా ముకేశ్ అంబానీ స్పందించారు. డొనాల్డ్ ట్రంప్ చూసే భారతదేశంలో గతంలో జిమ్మీ కార్టర్, బిల్ క్లింటన్, బరాక్ ఒమాలు చూసినదానికంటే భిన్నంగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. సత్య నాదెళ్ల కన్నా, తన కన్నా వచ్చే తరం విభిన్నమైన భారతాన్ని చూడబోతుందని ముకేశ్ అంబానీ వ్యాఖ్యానించారు.

భారత్‌లోని ప్రతి వ్యవస్థాపకుడు మిలియనీర్లు కావొచ్చు..

భారత్‌లోని ప్రతి వ్యవస్థాపకుడు మిలియనీర్లు కావొచ్చు..

అంతేగాక, మైక్రోసాఫ్ట్, భాగస్వామ్యాన్ని ప్రకటికటించిన ముకేశ్ అంబానీ.. రానున్న దశాబ్దాన్ని ఈ డీల్ నిర్వచించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశంలోని ప్రతి వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ లేదా బిల్ గేట్స్ అయ్యే అవకాశం ఉందన్నారు. సత్య నాదెళ్ల నేతృత్వంలో మైక్రోసాఫ్ట్ మరిన్ని మైలురాళ్లు సాధిస్తోందని, మైక్రోసాఫ్ట్ సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. కాగా, ట్రంప్ దంపతులు సోమవారం భారత్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. సబర్మతీ ఆశ్రమ సందర్శనంతోపాటు మోతేరాలో జరిగిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సభకు సుమారు లక్షా 20 మంది ప్రజలు హాజరయ్యారు.

English summary
A brand new India is welcoming US President Donald Trump in 2020, showcasing a thriving digital economy with robust transformation that is underway across industries -- which previous US presidents never witnessed, Reliance Industries Ltd (RIL) Chairman and Managing Director Mukesh Ambani said on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X