బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫుడ్ ప్యాకెట్ ఇచ్చాడు ,చేయి లాగాడు, రెండు వందలు ఇచ్చి, క్షమాపణ చెప్పిన స్విగ్గీ !

|
Google Oneindia TeluguNews

ఫుడ్ డెలివరి సంస్థ స్విగ్గీ డెలివరి బాయ్ వల్ల బెంగళూర్ కు చెందిన ఓ మహిళ లైంగిక వేధింపులను ఎదుర్కోంది, ఫుడ్ డెలివరి చేసిన బాయ్ ఆమేను లైంగికంగా వేధింపులకు గురి చేశారని, ఈ సంగతి స్విగ్గి సంస్థకు ఫిర్యాదు చేస్తే క్షమాపణ చెప్పి ఓ రెండు వందల గిఫ్ట్ కూపన్ ను పంపారు.

ఆన్‌లైన్ ఫుడ్ తిప్పలు

ఆన్‌లైన్ ఫుడ్ తిప్పలు

ఆన్‌లైన్ లో ఆర్డర్లు ,అందుబాటులో ధరలు, క్షణాల్లో ఫుడ్ డెలివరి ,ఇంకేముంది ఆర్డర్ పెట్టు, ఫుడ్ పట్టు అన్నట్టు తయారైంది సిటి జనం పరిస్థితి ,పని తీరిక లేకుండా కొందరు, అసలు పనిలేని మరికోందరు ఇలా చాలమంది ఆన్‌లైన్ ద్వార ఫుడ్ ఆర్డ్ చేయడం చాలమందికి అలవాటయిపోయింది. అయితే ఇదంతా బాగానే ఉన్నా , కొంతమంది పోకిరిరాయుళ్లకు మాత్రం ఇది కలిసి వస్తుంది.దీంతో ఫుడ్ ఆర్డర్ తీసుకునే సమయంలో మహిళలను అవమానాలకు గురిచేస్తున్నారు ఫుడ్ డెలివరి బాయ్స్.

బెంగళూర్ లో డెలివరి బాయ్ నిర్వాకం

బెంగళూర్ లో డెలివరి బాయ్ నిర్వాకం

తాజాగా ఇలాంటీ చేదు సంఘటన బెంగళూర్ లో ఓ మహిళకు ఎదురైంది . సదరు మహిళ రెండు రోజుల క్రితం ఆన్ లైన్ ఫుడ్ సప్లై సంస్థ స్విగ్గిద్వార తనకు సంబంధించిన ఫుడ్ ఆర్డర్ చేసింది.అయితే ఫుడ్ ఇచ్చే సమయంలో డెలివరి బాయ్ అనుమానాలకు గురిచేయడంతోపాటు తనను లైంగికంగా వేధించారని తెలిపింది.దీంతో ఆమే సంబంధిత స్విగ్గి కస్టమర్ కేర్ కు ఫిర్యాదు చేసింది.

ఒక క్షమాపణ ,రెండు వందల గిఫ్ట్ వోచర్

ఒక క్షమాపణ ,రెండు వందల గిఫ్ట్ వోచర్

ఈనేపథ్యంలోనే స్విగ్గి సంస్థ సదరు మహిళ ఫిర్యాదు పై స్పందించింది, ఒక లేఖలో క్షమాపణ చెబుతూ ఓ రెండు వందల రూపాయల గిఫ్ట్ కూపన్ పంపింది. దీంతో అప్పటికే జరిగిన సంఘటనపై ఇబ్బందిపడుతుంటే ,స్విగ్గి సంస్థ చేసిన పని, ఆమేను మరింత అవమానాలకు గురిచేసింది.దీంతో నేరుగా సంస్థ నిర్వాకాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. క్షమాపణలతో కేసును మూసి వేయకుండా డెలివరి బాయ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.దీంతో స్విగ్గి దిగివచ్చింది. మరోసారి ఫేస్ బుక్ లో క్షమాపణలు చెబుతూ ,బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు.కస్టమర్ సేఫ్టి తమకు అంత్యంత ప్రాధాన్యత అని తెలుపుతూ ఇలాంటీ హింసను తాము ప్రోత్సహించమని చెప్పారు.విషయం తెలిసిన వెంటనే కస్టమర్ తో నిరంతరం సంప్రదింపులు జరిపామని ,అందరి సహకారంతో సమస్యను సామరస్యంగా పరిష్కారిస్తామని స్విగ్గి ఆప్ కు చెందిన ప్రతినిధి తెలిపారు.

English summary
The delivery boy had allegedly sought sexual favours from the woman,Narrating the incident on social media, the woman said when the delivery boy turned up at the door with food, he abused her and asked for sexual favours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X