వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్ షోలో గాడిద అరెస్టు: పోలీసులా మజాకా

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర పోలీసులు ఎప్పుడూ ఏదో ఒక విదంగా వార్తలలో నిలుస్తారు. ఇప్పుడు ఓ మూగజీవిని అరెస్టు చేసి చర్చకు తెరలేపారు. పోలీసులు అరెస్టు చేసింది ఓ గాడిదను. విషయం తెలుసుకున్న పై అధికారులు మలెగావ్ పోలీసులను మందలించారు.

మాలెగావ్ మున్సిపల్ కార్పొరేషన్ లో అధికార కాంగ్రెస్ పార్టీ అవినీతిని వ్యతిరేకిస్తూ జేడీ(ఎస్) కార్యకర్తలు గురువారం ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు. ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణ కోసం ఓ గాడిదను కూడా తీసుకెళ్లారు.

Donkey arrested in malegaon in Maharashtra

విషయం తెలుసుకున్న పోలీసులు రోడ్ షో దగ్గర ప్రత్యక్షమయ్యారు. గాడిదను ఎవరు తీసుకురమ్మన్నారు అని ఆ నాయకులను ప్రశ్నించారు. గాడిదతో పాటు దాన్ని తీసుకొచ్చిన ముగ్గురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

గాడిదను ఆటోలో ఎక్కించి పోలీస్ స్టేషన్ దగ్గరకు తీసుకు వెళ్లారు. గాడిద ఆటో దిగడానికి మొండి చేసింది. పోలీసులు అతి కష్టం మీద గాడిదను కిందకు దించారు. కేసు నమోదు చేసిన తరువాత జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు.

ర్యాలీకి అనుమతి తీసుకున్నారని, అయితే గాడిదను తీసుకువస్తున్నామని తమకు ముందుగా సమాచారం ఇవ్వలేదని, శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా తాము ముందు జాగ్రత్తగా గాడిదను అరెస్టు చేశామని మాలెగావ్ అదనపు ఎస్పీ సునీల్ కదాన్నే తెలిపారు.

English summary
The animal's troubles began when workers of the Janata Dal-Secular (JDS) decided to use it to make a point against the Congress's corruption in the Malegaon municipal corporation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X