వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్ బి ఐ షాక్:మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే బాదుడే, డబ్బులు వేసినా, తీసినా ఇక చార్జీల మోత

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:బ్యాంకులు వరుసుగా తమ ఖాతాదారులకు షాక్ ఇస్తున్నాయి.ఇటీవలనే ప్రైవేట్ బ్యాంకులు తమ ఖాతాదారులకు షాక్ ఇచ్చాయి. మూడు దఫాల కంటే ఎక్కువ సార్లు నెలలో ఎటిఎం నుండి డబ్బులు డ్రా చేస్తే భారీగానే డబ్బుల్లో కోత విధించనున్నట్టు ప్రకటించాయి. ఈ షాక్ నుండి తేరుకోకముందే ఎస్ బి ఐ కూడ మరో షాక్ ను ఇచ్చింది. కనీస నగదు నిల్వలను ఖాతాల్లో మెయిన్ టైన్ చేయకపోతే భారీగా జరిమానాను విధించనున్నట్టు ఎస్ బి ఐప్రకటించింది.

ఎస్ బి ఐ ఖాతాదారులు తమ ఖాతాల్లో కనీస నగదు నిల్వలను మెయింటైన్ చేయాలని ఆ బ్యాంకు సూచించింది. ఒక వేళ కనీస నగదు నిల్వలను మెయింటైన్ చేయకపోతే జరిమానాను విధించనున్నట్టు ఆదివారం నాడు ఎస్ బి ఐ ప్రకటించింది.

ఐదేళ్ల విరామం తర్వాత ఎస్ బి ఐ ఈ విధానాన్ని మళ్ళీ తెరమీదికి తెచ్చింది. ఇక నుండి ప్రతి నెలలో కనీసం మూడు సార్లే బ్యాంకుల్లో డిపాజిట్ ను పరిమితం చేయనున్నారు.మూడు దఫాల కంటే ఎక్కువ సార్లు బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేయాలనుకొంటే ప్రతి డిపాజిట్ కు రూ.50 సేవా చార్జీగా వసూలు చేయనున్నారు.

dont have minimum balance in your sbi account, get ready to pay fine from april

ఎస్ ఎం ఎస్ ల అలర్ట్ పై మూడు నెలలకు రూ.15 చార్జీ వసూలు చేస్తారు. కొత్తగా అమల్లోకి వచ్చిన వడ్డీంపులు ఏప్రిల్ 1వ, తేదినుండి అమల్లోకి రానున్నాయి ఎస్ బి ఐ ప్రకటించింది. కొత్త ఖాతాదారులను ఆకర్షించేందుకుగాను కనీస నిల్వ నిబంధనను 2012 లో ఎస్ బి ఐ ఎత్తేసింది. తిరిగి దీన్ని ఏప్రిల్ నుండి అమలు చేయనుంది.

మెట్రో పాలిటన్ శాఖల్లో ఉన్న బ్యాంకు ఖాతాల్లో కనీసం నగదు నిల్వ ఐదువేల రూపాయాలు ఉండాలి. ఆ మేరకు నగదు నిల్వ లేకపోతే 75 శాతం కన్నా తక్కువ ఉంటే సేవా పన్నుతో కలిపి రూ.100 ఫైన్ వేస్తారు. మినిమమ్ బ్యాలెన్స్ కన్నా అకౌంట్ లో 50 శాతం తక్కువ మొత్తం ఉంటే సర్వీస్ చార్జీతో కలిపి రూ.50 చెల్లించాలి.

ఇతర బ్యాంకుల ఎటిఎంల నుండి నగదు ఉపసంహరణ మూడు సార్లు దాటితే రూ.20 చార్జీలు వసూలు చేయనున్నారు. ఎస్ బి ఐ ఎటిఎంలలో నగదు ఉపసంహరణ ఐదు సార్లు దాటితే రూ.10 చొప్పున చార్జీ వసూలు చేస్తారు.

బ్యాంకు ఖాతాల్లో రూ.25 వేల కన్నా ఎక్కువ మొత్తం ఉంటే ఎలాంటి ఛార్జీలు లేకుండానే ఎస్ బి ఐ ఎటిఎంల నుండి ఎన్ని ధఫాలైనా డబ్బులు డ్రా చేసుకోవచ్చు.నగదు విత్ డ్రా చేసిన సమయంలో ఎలాంటి చార్జీ పడకుండా ఉండాలంటే లక్ష రూపాయాలు ఖాతాలో ఉండాలి. వెయ్యి రూపాయాల వరకు యూపిఐ, యూఎస్ ఎస్ డి లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండవని ఎస్ బి ఐ ప్రకటించింది.

బ్యాంకులు వరుసుగా తమ ఖాతాదారులకు షాక్ ఇస్తున్నాయి.ఇటీవలనే ప్రైవేట్ బ్యాంకులు తమ ఖాతాదారులకు షాక్ ఇచ్చాయి. మూడు దఫాల కంటే ఎక్కువ సార్లు నెలలో ఎటిఎం నుండి డబ్బులు డ్రా చేస్తే భారీగానే డబ్బుల్లో కోత విధించనున్నట్టు ప్రకటించాయి. ఈ షాక్ నుండి తేరుకోకముందే ఎస్ బి ఐ కూడ మరో షాక్ ను ఇచ్చింది. కనీస నగదు నిల్వలను ఖాతాల్లో మెయిన్ టైన్ చేయకపోతే భారీగా జరిమానాను విధించనున్నట్టు ఎస్ బి ఐప్రకటించింది.

English summary
sbi has decided to reintroduction on non maintenance of minimum balance in accounts form april 1, and revised charges on other services including atms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X