వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల వేళ మావోయిస్టుల ఘాతుకం: దూరదర్శన్ కెమెరామెన్ తోపాటు ఇద్దరు జవాన్లు మృతి

|
Google Oneindia TeluguNews

దంతెవాడ: కొద్ది రోజుల్ల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతంలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. దంతెవాడ ఆరాన్‌పూర్‌లో మావోయిస్టులు దాడికి దిగారు. ఈ దాడిలో దూరదర్శన్‌ కెమెరామెన్‌తో పాటు ఇద్దరు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

చనిపోయిన వారిలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, కానిస్టేబుల్‌ ఉన్నారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. దంతెవాడలో ఎన్నికల ప్రచారాన్ని కవర్‌ చేసేందుకు దూరదర్శన్‌ మీడియా బృందం అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

Doordarshan cameraman, 2 cops killed in Naxal attack in Chhattisgarh

మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం రావడంతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టామని అదే సమయంలో దాడి జరిగినట్లు ఎస్పీ అభిషేక్‌ పల్లవ్‌ తెలిపారు. మావోయిస్టుల దాడిలో దూరదర్శన్‌ కెమెరామెన్‌, ఇద్దరు భద్రతా సిబ్బంది చనిపోయిన విషయాన్ని ఛత్తీస్‌గఢ్‌ డీఐజీ సుందర్రాజ్‌ ధ్రువీకరించారు.

మావోయిస్టు దాడిని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. మావోయిస్టుల దాడులపై ప్రధాని తీవ్రంగా మండిపడ్డారు. మావో ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిలోకి రాకుంటే త్యాగాల కోసం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, కేబినెట్‌ను కూడా పంపిస్తామని అన్నారు.

వచ్చే నెలలో ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. నవంబరు 12న తొలి దశ, 20వ తేదీన రెండో దశ పోలింగ్‌ నిర్వహించనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తొలి దశ పోలింగ్‌ జరగనుంది.

సోమవారం ఛత్తీస్‌గఢ్‌లోని బీజేపీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు తగ్గుముఖం పట్టాయని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే మావోయిస్టులు ఈ దాడికి పాల్పడటం గమనార్హం. కాగా, రెండు రోజుల క్రితం కూడా బీజాపూర్‌ జిల్లాలో సీఆర్‌పీఎఫ్‌ బలగాల వాహనాన్ని మావోయిస్టులు పేల్చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో నలుగురు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

English summary
The crew of national broadcaster Doordarshan and two cops were killed after Naxals carried out an attack in Chhattisgarh's Dantewada. The DD Cameraman who was martyred in today's attack has been identified as Achyutanand Sahu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X